మొన్న పాఠశాల ఉపాధ్యాయులు, నిన్న జిల్లా శాఖల అధికారులు, నేడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. కారెవరూ జీతాలు 1వ తేదినా టికి పడటానికి అనర్హులు. ఒక ప్రభుత్వశాఖతో మొదలై ఆలస్యం క్రమేపీ అన్ని ప్రభుత్వశాఖలకూ వర్తింపజేస్తోంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వ శా ఖ అధికారులకు జీతాలు పడకపోయినా సచివాలయ ఉద్యోగులకు జీతాలు 1వ తేదినాటికి టంచనుగా పడేవని చెప్పిన వారు మీ పరిస్థితే మా కూ వచ్చిందంటూ ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర మొరపెట్టుకుంటున్నారు. అందులోనూ సీఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ ప్రస్తుతం పనిచే యడం లేదనే వార్త కూడా రాష్ట్రవ్యాప్తంగా దావానంలా వైరల్ అవుతుంది. సాధారణ జీతాలతోపాటు, ఇతర ఏ రకమైన బిల్లులు పెట్టడానికి వీ లుపడని పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. మొదట పదిరోజులు ఆలస్యంగా పడిన జీతాలు, ఆపై 15 రోజులయ్యే పరిస్థితి వస్తే బ్యాంకు ఈఎంఐలు, హౌసింగ్ లోన్లకు పెనాల్టీలు కట్టక తప్పదంటున్నారు ఉద్యోగులు.