విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో తొలిరోజు రూ.రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పేర్కొ న్నారు. జిఐఎస్ వేదిగా ఈ విషయాన్ని సీఎం ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా 92 ఎంఓయూలును కుదుర్చుకోనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయన్న సిఎం మిగిలిన 248 ఎంఓయూలు రేపు కార్యరూపం దాల్చనున్నాయన్నారు. ఈ ఒప్పందాల విలువ రూ.1.15 లక్షల కోట్లు కాగా. వీటిద్వారా దాదాపు 2లక్షల మందికి ఉద్యోగఅవకాశాలు రానున్నాయి. రిలయెన్స్, అదాని, ఆదిత్య బిర్లా, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు.