ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో ఏ అభ్యర్ధి గెలవాలన్నా ప్రస్తుతం రిజిస్టర్ అయిన 2,89,214 ఓట్లలో సగానికిపైగా ఒక అభ్యర్ధికి పడాలి. ప్రస్తుతం ఎన్నికల బరిలో 37 మంది నిలబడినా..ప్రధాన పోటీ మాత్రం నలుగురు అభ్యర్ధుల మధ్యే ఉన్నది. ఎన్నికల 13వ తేది ఉదయం 8గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 331 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుంది. ఎమ్మెల్సీ పీటంపై అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు పీడిఎఫ్, బీజేపీ అభ్యర్ధులు కూడా ఎవరి ధీమాలో వారున్నారు. ఎన్నడూలేనివిధంగా సార్వత్రిక ఎన్నికలను తలిపించే విధంగా ఈసారి ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తీరు అన్నివర్గాల ప్రజలను ఆలోచింపజేస్తున్నది. ప్రధాన పోటీలో ఉన్న అభ్యర్ధులు గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ మిగతా అభ్యర్ధుల వలన ఈసారి ఓట్లు చీలిపోతాయనే భయం అందరినీ వెంటాడుతోంది. మొదటి ప్రాధాన్యత అత్యధిక ఓట్లు ఎవరికి వస్తాయోననే ఉత్కంఠ మొదలైంది..!