ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపుపై ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రభావం గట్టిగా పడేటట్టు కనిపిస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా 3జిల్లా ల్లో అత్య ధికంగా ఉపాధ్యాయులు పనిగట్టుకొనిమరీ ఈసారి ఎమ్మెల్సీ ఓట్లు రిజిస్ట్రేషన్లు చేయించారు. అదేసమయంలో ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు కూడా ఫలప్ర దం కాలే దు. ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలతోనే నిరసన తెలియజేస్తున్నారు. దీనితో ఎమ్మెల్సీ ఎన్నికపై వీరిఓటు ప్రభావం గట్టిగానే చూపిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. అంతేకాకుండా సామాజిక మాద్యమాల్లో కూడా ఇదేవిషయమై పెద్దస్థాయిలో చర్చకూడా నడుస్తున్నది. మనఓటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మార్పుతేవాలని అనేని నాదాన్ని బలంగా ఓటర్లలోకి చాపక్రిందనీరులా తీసుకెళ్లారని తెలుస్తుంది. ఉద్యోగులేకాకుండా, ఉపాధ్యాయులు, వారి పిల్లలు, బంధువులు, వారికి తెలిసిన వారితోకూడా పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపి క్రాస్ ఓటింగ్ జరిగేలా పక్కాపథక రచనచేశారని చెబుతున్నారు. చూడాలి ఏంజరుగుతుందో..!