ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ గెలుపుపై ఆ నలుగురుపై ఎవరికి వారు భారీ అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్నికలబరిలో37 మంది నిలబడి నా, ప్రధా నంగా పోటీ మాత్రం 4గురు అభ్యర్ధుల మధ్యే నెలకొంది. మొత్తం ఓట్లు 2లక్షల 89వేల214 కాగా మూడు జిల్లాల్లో అత్యధికంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో జిల్లాలో అత్యధిక శాతం ఓట్లు పోలయ్యాయి.2వస్థానంలో శ్రీకాకుళం, మూడవ స్థానంలో విశాఖపట్నం జిల్లాలు నిలిచాయి. అయితే గెలుపుపై అధికారపార్టీతోపాటు, మిగి లిన మూడు పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ అయిన తరువాత ఓటర్లు ఏ అభ్యర్ధికి ఓటు వేశారో ఈసారి బహిరంగంగా చెప్పడంతో గెలుపుపై ఎవరి అంచనా ల్లో వారు నిమగ్నమయ్యారు. ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించడం, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు భా రీగా ఓటింగ్ లో పాల్గొనడంతో గెలుపుపై భిన్నకధనాలు వినిపిస్తున్నాయి. చూడాలి విజయం ఎవరిదో..!?