ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 క్వాలిఫైడ్ డిఎస్సీ అభ్యర్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా 4534 మంది క్వాలి ఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో వీరి నియామకం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ఈ ఉత్తర్వుల ద్వారావీరందరుకి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమీషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు డిఎస్సీ అభ్య ర్ధులకు పోస్టింగులు ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇస్తుండటం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.