ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారిచేసింది. ఓట్లు లెక్కించినా తుది తీర్పునకు లోబడి ఫలితం ఉంటుందన్న హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు అభ్యర్థి, న్యాయవాది శ్రీనివాసరావు. అం తేకాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రోజున హైకోర్టుకు సెలవులు ఇచ్చారన్న పిటిషనర్ ఎన్నికలు జరగని చోట హైకోర్టుకు సెలవులు ఇచ్చారని కోర్టుకి తెలియజేశారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదని తెలియజేయడంతో పిటిషన్‌ను అనుమతించి విచా రణ చేపట్టింది హైకోర్టు ధర్మాసనం. పిటిషనర్ తరపున న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. సెలవులు లేకపోవడంతో అభ్యర్థికి లాయర్లు, ఉద్యోగులు ఓటు వేయలేకపోయారని కోర్టుకి తెలియజేశారు. చాలా మంది న్యాయవాధులు ఓటు హక్కు అవకాశాన్ని కోల్పోయారని కోర్టుకి తెలియజేశారు. దీనితో ఓట్లు లెక్కించినా తుది తీర్పునకు లోబడే ఉండాలంది హైకోర్టు.