ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపి


Ens Balu
38
Visakhapatnam
2023-03-17 12:58:46

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవ ర్గానికి జరిగిన ఓట్ల లెక్కింపులో 37 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, అందులో 34 మంది అభ్యర్ధుల డిపాజి ట్లు గల్లంతయ్యాయి. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కూడా డిపాజిట్ దక్కించుకోలేక పోయారు. మొత్తం చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వచ్చిన అభ్యర్థికే డిపాజిట్లు వచ్చినట్టవుతుంది. అంటే సుమారు 33 వేల ఓట్లు వచ్చిన వారికి మాత్రమే డిపాజిట్లు లభిస్తాయి. అయితే, పోటీలో ఉన్న పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభ, టిడిపి అభ్యర్థి చిరంజీవి, వైసీపీ అభ్యర్థి సుధాకర్ లకు మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. మిగిలిన 34 మంది డిపాజిట్లు కోల్పో యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామని ప్రకటించిన బీజేపి డిపాజిట్లు కోల్పోవడం ప్రాధాన్యత సంతరించు కుంది. అయితే బిజెపీ అభ్యర్ధి మాదవ్ కి డిపాజిట్లు కూడా దక్కకపోవడానికి కారణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఎల్ఐసీ తో సహ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలన ప్రైవేటు పరంచేస్తామన్న కేంద్రప్రభుత్వ ప్రకటనే ప్రధాన కారణంగా చెబుతున్నారు.