ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఒత్తిడి పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ఏప్రిల్1 నుంచి వర్క్ టు రూల్ ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అందుతున్నది. వర్క్ టు రూల్ అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకే విధులు నిర్వహిస్తారు. కానీ ఈసారి ఇకపై ఉద్యోగుల సెల్ ఫోన్లు కూడా వర్క్ టు రూల్ పాటించనున్నాయట. అంటే విధి నిర్వహణ సమయంలో తప్పా, మిగిలిన సమయంలో స్వి చ్చాఫ్ లో ఉంటాయి. అదేజరిగితే రాష్ట్రంలోని పరిపాలన మొత్తం స్థంబించిపోతుంది. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఇదొక్కటే మార్గమని నిర్ణయించుకొని, అంతా కలిసికట్టుగా ఏకతాటిపైకి రావాలని యోచిస్తున్నట్టు సమాచారం. దానికోసం ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రతినిత్యం కనిపిస్తన్న పోస్టింగ్ లే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అదేజరిగితే వారంలో జరగాల్సిన పనులు నెలరోజులైనా పూర్తికావు..!?