ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అన్ని రాజకీయపార్టీల చూపు అసెంబ్లీపైనే ఉంది. ఈ ఎన్నిక ఉదయం 8నుంచి సాయంత్రం4 వరకు జరగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే..సాయంత్రం 5నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. అందర్నీ ఏకకాలంలో తరలించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. చంద్రబాబుతో కలిసే ఓటింగ్‌కి వెళ్లబోతున్న 19 మంది ఎమ్మెల్యేలు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. మెజార్టీ వైఎస్సార్సీ ఎమ్మెల్యేలు. ఈ పోలింగ్ మొత్తం విప్ వర్సెస్ ఆత్మప్రబోధానుసారం కాన్సెప్ట్‌లో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీచేస్తున్న ఒక్క సీటును గెలిచితీరతామంటోంది టీడీపీ.. అయితే ఏడుకు ఏడు సీట్లు తమవేనన్న ధీమాలో ఉంది వైఎస్సార్సీపి. ఎవరి ధీమా వాళ్లకు ఉన్నా.. ఎవరి టెన్షన్ కూడా వాళ్లనే వెంటాడుతోంది.. ఎందుకంటే.. ఈ పోటీల్లో గెలుపోటములను రెబల్స్ టెన్షన్ ప్రభావితం చేయబోతున్నాయి..ఎవరిమైండ్ గేమ్ ఫలిస్తుందో చూడాలి..?!