ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వారి సామాజిక వర్గ సంఘాలుగా విడిపోతున్నారు. న్యాయమైన సమస్యలు, డి మాండ్లపై ఏకాతాటిపైకి వస్తామన్న వీరంతా విభజించు..పాలించు అనే మంత్రానికి ముగ్దులైపోతున్నారు. దీనితో ఉద్యోగసంఘాలు కాస్త కులసంఘాలుగా మారిపోతున్నా యి. అనుకున్న లక్ష్యాన్ని నేతలు నీరుగార్చడానికి సులువుని వీళ్లే సులువులన్నీ ఇచ్చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విషయం రుజువైందని..లేదంటే లక్ష్యానికి చేరువవుతున్న సమయంతో ఎవరో నేతల బెదిరింపులకు, తాయిలాలకు ఎందుకు మడమతిప్పారని విడిపోయిన ఉద్యోగ సంఘాల వాళ్ల లో వాళ్లే దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రస్తుతం ఈఅంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఉద్యోగ సంఘాల తీరు ప్రతీఒక్కరినీ ఆలోచింపజేస్తున్నది. కులం లేదు, మతం లేదు అన్నవారే ముఖ్యనేతలుగా మారిపోతుండటం విశేషం..!?