ఆంధ్రప్రదేశ్ లో44వేల మంది జర్నలిస్టులు ఏపార్టీ వైపు..?!


Ens Balu
195
Amaravati
2023-03-26 07:44:35

ఆంధ్రప్రదేశ్ లో 44వేల మంది జర్నలిస్టులు,ఆ కుటుంబాలు ఏపార్టీకి వైపు ఉంటారనేది ఇపుడు రాష్ట్రంలో జోరుగా చర్చనడుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరు వాత జర్నలిస్టుల హెల్త్ కార్డులు తప్పితే ఇతర ఏ పథకాలూ జర్నలిస్టులకు వర్తించలేదు. కొన్నిచోట్ల మాత్రం ఎమ్మెల్యేల సహకారంతో ఇళ్లస్థలాలు వచ్చాయి. జర్న లిస్టుకి ముఖ్యమైన గుర్తింపైన ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా జిఓ‌-142 మోకాలడ్డింది. 4గేళ్లు పూర్తైన తరువాత ఎన్నికలకు ఏడాది ముందు ప్రభుత్వం  జర్నలిస్టుల మీడియా అక్రిడి టేషన్ కార్డుల జారీకి సవరణలు చేయడానికి కేబినెట్ అంగీకరించిందని, ఆపై వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాల ఇస్తామని ప్రకటించా రు. కానీ ఇపుడు రాష్ట్రంలోని 4.98 కోట్లు ఉన్న ఓటర్లలో జర్నలిస్టు కుటుంబాల ఓట్లు(భార్య, భర్త, ఇద్దరు పిల్లలు) సగటున 4ఓట్లు లెక్కన చూసుకుంటే మొత్తం 176,00 0 వేల ఓట్లు 2024లో జరిగే ఎన్నికల్లో ఎవరికి పడతాయనే చర్చ రాష్ట్రంలో వైరల్ అవుతోంది..!?