ఏప్రిల్ నెల 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ ని జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్టు ఎపిపిఎస్సి ప్రకటించింది. ఈ పరీక్షలను జూన్ మూడు నుంచి 9 వ తేధీ వరకు చేపడతామని పేర్కొంది. 2022 సివిల్స్ ఫేజ్ - 3 ఇంటర్వ్యూలు ఏప్రియల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేశామని ఎపిపిఎస్సి వివరణ ఇచ్చింది. అయితే యుపిఎస్సి సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎపి నుంచి హాజరవుతున్న దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్ధులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ సమయం తీసుకున్నామని పేర్కొంది. ఇప్పటికే ఇంటర్వ్యూల షెడ్యూల్ యుపిఎస్సీ విడుదల చేసింది. సివిల్స్ ఇంటర్వ్యూల కారణంగా మెయిన్స్ ని జూన్ లో నిర్వ హించాలని ఎపిపిఎస్సీ నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి గ్రూప్-1 మెయిన్స్ కి సమయం కావాలని అభ్యర్ధు లు ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్ధుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.