ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు 3 ISO సర్టిఫికెట్లు
Ens Balu
18
Tirupati
2023-03-29 12:03:31
శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలకు 3విభాగాల్లో ఐ ఎస్ వో సర్టిఫికెట్లు లభించాయి. టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం ఈవో ఎవి ధర్మారెడ్డి నుంచి కళాశాల ప్రిన్సిపల్ డా.మురళీకృష్ణ అందుకున్నారు. ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యుత్ పొదుపు చేసినందుకు, కళాశాల ఆవరణంలో పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు సర్టిఫికెట్లు లభించాయి. అలాగే కళాశాల.నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు మరో సర్టిఫికెట్ లభించాయి. కళాశాల ప్రిన్సిపల్ డా. మురళీకృష్ణ, ఇతర అధ్యాపకులు, సిబ్బందిని ఈవో ఈ సందర్భంగా అభినందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.సుందరం, ఐఎస్ వో ప్రతినిధులు శివయ్య, మౌళిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు గాను ఐ ఎస్ వో సర్టిఫికెట్ లభించింది. ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్ ఈవో నుంచిసర్టిఫికెట్ అందుకున్నారు.