ఏపీలో గిరిజనులు YSRCPకి దూరమవుతున్నారా..?!


Ens Balu
89
Amaravati
2023-03-30 03:34:08

ఆంధ్రప్రదేశ్ లో గిరిజన ఆదివాలసీలు వైఎస్సార్సీపికి దూరమవుతున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార వై ఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్టీల జాబితాలోకి బోయ, వాల్మీకిలను చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే దీనికి కారణంగా చె బుతున్నారు. ఏపిలోని 26 జిల్లాల్లో గిరిజనులు 75లక్షల మందికిపైనే ఉన్నారు. వీరంతా ఒక్కసారి తిరగబడేసరికి గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు సైతం పత్తాలేకుండా తిరుగుతున్నారు. ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయం కారణంగా మార్చిన 31న ఉమ్మడి విశాఖజిల్లా, విభజన అల్లూరి జిల్లావ్యాప్తంగా బంద్ కి కూడా గిరిజన సంఘం పిలుపునిచ్చింది. అయితే ఈ విషయంలో మాత్రం  ప్రభుత్వం ఎక్కడా తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. కాగా గిరిజనుల ప్రధాన ఓటు బ్యాంకుతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈవిషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించకపోవడంతో వీరినికూడా గిరిజనులంతా గిరిజన ద్రోహులుగానే చూస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.