గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు..!


Ens Balu
4
Amaravati
2020-09-27 09:21:04

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థలో ఉత్తుత్తి కార్యదర్శిలు పనిచేస్తున్నారు..ఏంటి కాస్త తేడాగా ఉందనుకుంటున్నారా...మీరు చదువుతున్నది నిజమే. ప్రస్తుతం రాష్ట్రంలోని గత పంచాయతీలు మినహా కొత్తగా చేరిన కార్యదర్శిలకు పనిలేకుండా పోయింది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓఎంఎస్ నెంబను 149 అమలు చేయకపోవడమే. ఈ జీఓ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విధుల్లోకి చేరిన కార్యదర్శిలకు పూర్తిస్థాయిలో పని ఉండాలి. కానీ.. కార్యదర్శి అనే పదానికి అర్ధంలేకుండా పాత, సీనియర్ కార్యదర్శిలకు సహాయకులగానే నేటికీ నూతన గ్రేడ్5 కార్యదర్శిలు పనిచేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కొత్తగా చేరిన కార్యదర్శిలకు తమకు పనులు లేకుండా పోయాయని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్న విషయం నేడు హాట్ టాపిక్ గా మారింది. నూతన కార్యదర్శిలు పెట్టుకున్న జీఓ ప్రకారం వివిధ ప్రాంతాల్లో వున్న గ్రామసచివాలయాల పరిధిని విభజన చేయాలి. వారి విధులు వారిని నిర్వర్తించుకునేలా చేయాలి. కానీ రాష్ట్రప్రభుత్వం గ్రామసచివాలయ వ్యస్థ అని నామకరణం చేసి, దానికి ప్రభుత్వంలో ఒక ప్రత్యేక శాఖను కేటాయించినా ఇంకా రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థే నడుస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మా విధులు, మా ఉద్యోగాలు మమ్మల్ని ప్రభుత్వ జిఓ ప్రకారం చేసుకోనీయండి మహా ప్రభో అని గ్రేడ్ 5 నూతన కార్యదర్శిలు నెత్తీనోరూ మెరపెట్టుకుంటున్నా...ఫలితం లేకుండా పోతుంది. విశేషం ఏంటంటే గ్రామసచివాలయ కార్యదర్శిలు తాము చేస్తున్న ఉద్యోగం ఏమిటో తమకే తెలియడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సీనియర్ కార్యదర్శిల నుంచి కొన్నిచోట్ల వేధింపులు కూడా ఎదుర్కొంటున్నారు. అదీ ఎలా ఉంటే మేము చెప్పినట్టు ఉద్యోగం చేయకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయ్ అనే బెదిరింపుతో కొందరు కార్యదర్శిలు, సీనియర్ల దగ్గర అటెండర్లుగా పనిచేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. గ్రామసచివాలయ వ్యవస్థలో జరుగుతున్న లోపాలపైనా, రాష్ట్రవ్యాప్తంగా కార్యదర్శిలంతా జిల్లా పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్న విధుల బదలాయింపు విషయమై ఈఎన్ఎస్ నెట్వర్క్ గ్రౌండ్ లెవల్ రిపోర్టింగ్ ప్రారంభించింది. ప్రభుత్వ ఆశయానికి కొందరు సీనియర్ ఉద్యోగులు, మరికొందరు మోనోపోలీ కార్యదర్శిలు, వారికి సహకరిస్తున్న మండల స్థాయి అధికారులు ఏవిధంగా గాలితీసే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. వాటిని గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు అనే  దారావాహిక న్యూస్ కార్డ్ అర్టికల్స్ గా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. మరిన్ని వివరాలు గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-2 లో చూడవచ్చు..!