YSRCP థీమ్ వైనాట్ 175/175 But ఈసారి 4 అవుట్


Ens Balu
161
Amaravathi
2023-03-31 01:38:32

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్సీపీ వైనాట్ 175/175 థీమ్ తో ముందుకి వెళ్లాలనుకుంటే అపుడే 4గురు ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందే ఔట్ అయిపోయారు. మరో పక్క పక్కాగా గెలుస్తామనుకున్న 4 ఎమ్మెల్సీలు కూడా టిడిపి వసం అయిపోయాయి. దీనితో ఇపుడు వైనాట్ 175/ 175 అనే థీమ్ కాస్తా తింక్ 175/175 స్లో అండ్ స్టడీ అనే ఆలోచనలోకి వచ్చేశారని చమత్కరిస్తున్నారు పరిశీలకులు. టిడిపి తన రాజకీయచతు రతను ప్రదర్శిస్తే రానున్నరోజుల్లో మరింతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే అవకాశాలూ కూడా లేకపోలేదని చెబుతు న్నా రు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పొందిన వారంతా పక్కాగా పార్టీకే మద్దతు పలి కే అవకాశం కూడా లేకపోలేదని. పోతే గీతే  ప్రభుత్వ ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, గిరిజనులు మా త్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు తప్పితే.. మిగిలిన వారంతా వైఎస్సార్సీపికి అనుకూలమే అంటున్నారు.