పర్యాటక ప్రేమికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..


Ens Balu
2
Visakhapatnam
2020-09-27 10:16:32

పర్యాటక ప్రమేమికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటిని టూరిజం ప్యాకేజిగా అభివ్రుద్ధి చేయను న్నట్టు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలియజేశారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కొత్త పర్యాటక ప్రాంతాలు అన్ని జిల్లాల్లోనూ ఆదరణకి నోచుకోకుండా ఉన్నాయని వాటన్నింటిని గుర్తించి జిల్లాల వారీగా టూరిజం ప్రాజెక్టులుగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. తద్వారా విశాఖపట్నం లాంటి అంతర్జాతీయ ఖ్యాతి వున్న ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించడానికి వీలుపడుతుందని చెప్పారు. అదే విధంగా కొత్తగా టూరిజంహోటళ్లు కూడా రాబోతున్నాయని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ టూరిజం ప్రాజెక్టులను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ షిప్ లో అభివృద్ధి చేసేందుకు పథకాలను, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖ నగరం, జిల్లాలో పర్యాటక ప్రాంతాల సందర్శన రంగంలో అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తించామన్నారు.  ఏజెన్సీ ప్రాంతాల సందర్శన, యాత్రా స్థలాల సందర్శన, విహారస్థలాలు చారిత్రక ప్రదేశాలు హస్తకళల విభాగాలను కలిపి ఒక  ప్యాకేజీ గా చేస్తామని వివరించారు. దీంతో విశాఖజిల్లాలో ఇప్పటి వరకూ ఉన్న పర్యాటక ప్రాంతాలతోపాటు, కొత్తగా మరికొన్ని పర్యాటక ప్రాంతాలు ఏర్పాటు అయ్యే అవకాశం వుంది. తద్వారా మరికొందరికి ఉపాదికూడా పెరుగుతుందని మంత్రి మీడియాకి వివరించారు...