కొత్తజిల్లాల పాలనకు ఏడాది పూర్తి.. శాస్వత కార్యాలయమేది


Ens Balu
44
Tadepalli
2023-04-04 04:16:25

ఆంధ్రప్రదేశ్ లో 13 కొత్త జిల్లాల పరిపాలనకు నేటితో ఏడాది పూర్తయింది. పరిధి తగ్గడంతో అధికారులకు ప్రజల సమస్యల పరిష్కారించడం సులవవుతుంది. వాటికితోడు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుతో ఇంటిముంగిటే సేవలు అందుతున్నాయి. కాకపోతే జిల్లా శాఖల్లో అధికారులు, సిబ్బంది చాలినంత లేపోవడంతో కాస్త వెనుకుబాటు తప్పితే కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజలకు అధికారులు చేరవవుతున్నారు. వాస్తవానికి ఏపీలో కొత్త జిల్లాలకు రాష్ట్ర గవర్నర్ అనుతి తప్పా, కేంద్రంలో రాష్ట్రపతి అనుమతి లేదు. దీనితో కేంద్రం ద్రుష్టిలో ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 13 జిల్లాలే. కేంద్రం ఏపీ విభజించిన కొత్త జిల్లాలకు అనుమతులు లభిస్తే నిధులు కూడా కొత్తజిల్లాలకు వస్తాయి. జిల్లాల విభజన వలన అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం మార్గం సుగమం చేసింది. 75 ప్రభుత్వశాఖలను అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేసినప్పటికీ, అద్దె కలెక్టరేట్లు.  జిల్లా కార్యాలయాలు తప్పితే పాత 13 జిల్లాల్లో మాత్రమే శాస్వత ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ఉన్నాయి.
సిఫార్సు