ఆంధ్రప్రదేశ్ లో సుమారు 3.50లక్షలకు పైగా ఉన్న రైటర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు 4వ తేదీ వచ్చినా పెన్షన్లు పడేలేదు. మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులకే ఆలస్యం అయ్యేది ఇపుడు పెన్షనర్లమైన మాకు కూడా ప్రభుత్వం పెన్షన్లు ఆలస్యంగానే వేస్తోందని అంటున్నారు పెన్షనర్లు. తమ సర్వీసు మొత్తం ప్రభుత్వంలోనే చేసినా..నేడు పెన్షన్లు ఎప్పుడు పడతాయాని ఎదురుచూసే రోజులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకరి దశలో కాస్త సేదతీరుదామంటే, ఒకటో తేదీన పడాల్సిన పెన్షన్లు ఎప్పుడు పడతాయాని రోజులు లెక్కించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.