ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్నది. నేటి వరకూ 75 ప్రభుత్వ శాఖల్లో పదోన్న తుల ఫైళ్లు మాత్రం ముందుకి కదలడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమకు పదోన్నతులు వస్తాయని ఎదురు చూసిన ఉద్యోగులు, అధి కారులకి కొంతమేర మాత్రమే న్యాయం జరిగింది. ఇంతా అత్యధిక ప్రభుత్వశాఖల సిబ్బంది, అధికారులు వారి పదోన్నతల కోసం తమ రాష్ట్ర కార్యాలయం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటు అయిన తరువాత అన్నిశాఖల ఉద్యోగులకు పదోతన్నతులు కల్పించడం ద్వారా క్రిందిస్థాయి ఉద్యోగులు, అధికారుల ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలిసేది. కానీ ప్రభుత్వం ఉద్యోగుల పదో న్నతుల విషయంలో మీనమేషాలు లెక్కిస్తుందని..ఇంకో 6నెలల్లో తమకు పదోన్నతులు రాకపోతే, మళ్లీ వచ్చే ప్రభుత్వం వరకూ వేచి చూడా ల్సిందేనని..ఈలోగా ఎంతమంది ఉంటారో, మరెంత మంది సర్వీసులోనే కాలం చేస్తారో నని ఉద్యోగులు వాపోతున్నారు.