వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో కార్యవర్గం అంటే ఒక ఆదాయ వనరు అంటే తెలుసుగానీ..అదొక సొసైటీ/ట్రస్టు/సంఘం అని..అది (Under Section 23 Of The Andhrapradesh Societies Registration Act-2001)లోబడే ఉందని, ఇదికూడా చట్ట పరిధిలోకే వస్తుందని, సొంతనిర్ణయాలు, కాలం చెల్లిపోయిన పాలవర్గం కార్యక్ర మాలు చట్టవ్యతిరేకమని ఎవరికైనా తెలుసా? నిజంగా విజెఎఫ్ బయిలా ప్రకారమే ప్రస్తుత పాలకవర్గం నడుచుకుంటే..కోర్టుకేసుల విషయం కేసుల నెపంతో 12ఏళ్లు గడిపే సిన కాలంలో సర్వసభ్య సమావేశం పెట్టి చెప్పాలని తెలీదా? లేదంటే భారత రాజ్యాంగం విజెఎఫ్ కి ఏమైనా అతీత శక్తులు, అవకాశాలు, మినహాయింపులు ఇచ్చిందా? ఎం తకాలమైనా ఇష్టం వచ్చినట్టు జనరల్ బాడీ సమావేశాలు, ఆడిట్ లెక్కలు తేల్చకుండా, సొసైటీని నిబంధనల ప్రకారం రెవిన్యువల్ చేయకుండా ప్రత్యేక అనుమతులు తె చ్చుకుందా..? కాస్త చెప్పండి బాబు ఇప్పటికైనా తెలుసుకుంటాం అంటున్నారు జర్నలిస్టులు.