ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖకు షిఫ్ట్ అవుతా మని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ విశాఖ ఆమోదయోగ్యమైనదని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుగా ప్రకటిం చినట్టు గా పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడే ఉన్నామన్నారు. విశాఖ నుంచి పరిపాలన చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎంఓ లోని పరిపాలనా విభాగంలోని సీనియర్ ఐఏఎస్ లను సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలో కొన్ని భవనాలు సీఎం కార్యాల యం, క్యాంపు కార్యాలయం జిఏడి కి పనికొచ్చేలా సిద్ధం చేసినట్టు సమాచారం. గీతం యూనివర్శిటీకి దగ్గర్లో నిర్మాణం అవుతున్న భారీ కట్టడా లు కూడా ప్రభుత్వశాఖల కోసమే వినియోగించనున్నారని కూడా మరోవైపు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ చేసిన ప్రకటనలో వైఎస్సార్సీ పీ ఉత్తరాంధ్రా శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.