జిల్లాశాఖల తరువాతే సచివాలయ ఉద్యోగుల బదిలీలు


Ens Balu
134
Tadepalli
2023-04-26 04:57:16

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 75 శాఖల్లోని జిల్లా అధికారులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టిన తరువాతనే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు జిఏడిలోని అధికారులు ఆయాశాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. ఈనెలాఖరులేదా వచ్చే నెల మొదటి వారంలో జిల్లాఅధికారుల బదిలీల తరువాత మిగిలిన ప్రక్రియ చేపట్టనున్నారు. కాగా అన్ని ప్రభుత్వశాఖల మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టభద్దత ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈకారణంగా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల నిబంధనలు అమలు చేయాలా..? లేదంటే ప్రత్యేకంగా వీరి కోసం నిబంధనలు రూపొందించాలా అనే విషయాన్ని సచివాలయశాఖ ప్రత్యేక కార్యదర్శి ముఖ్యమంత్రి దృష్టికి, జిఏడి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సీఎం వైఎస్ జగన్ నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే సచి వాలయ ఉద్యోగుల బదిలీలకు  విధివిధానాలు రూపొందించే అవకాశాలున్నాయంటున్నారు రాష్ట్ర అధికారులు.!
సిఫార్సు