ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం వసతి సౌకర్యాల రిజర్వేషన్ ఆన్ లైన్ చేశారు. ఈ మేరకు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ మీడియాకి ఒక ప్రకటన జారీచేశారు. ప్రస్తుతం వివిధ కాటేజీలలో అందుబాటులో ఉ న్న వసతి, గదులు 50% కోటాను ఆన్ లైన్ లో ఈనెల 26 నుంచే అందుబాటులో ఉంచారు(దీని నుంచి ఎస్ఆర్సీ, ఎస్న్సీని మినహాయిం చా రు). ఇప్పటివరకూ అన్నవరం దేవస్థానంలో కాటేజీల బుకింగ్ ఒక ప్రహసనంలా ఉండేది. కొత్తగా దేవదాయశాఖలో కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.సత్యన్నారాయణ బాధ్యతలు తీసుకున్న తరువాత భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే అన్నవ రంలోని గదుల రిజర్వేషన్ ఆన్ లైన్ చేశారు. ఇక నుంచి భక్తులు www.aptemples.ap.gov.in ద్వారా 50% వసతిని నేరుగా రిజర్వేషన్ ఆన్ లై న్ లో చేసేకోవచ్చు. తద్వారా దళారీ వ్యవస్థకు చాలా వరకూ అడ్డకట్ట వేసినట్టు కూడా అయ్యింది.