గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీల విషయంలో ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది. వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లోని సబార్డినేట్ సర్వీస్ రూల్స్, పదోన్నతులు, బదిలీల అంశాలే పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నది. కాకపోతే ఈ శాఖకు ప్రభుత్వం ఇంకా చట్టబద్దత కల్పించలేదనే విషయాన్నిఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారికి మొబైల్ యాప్ Ens Live, అధికారిక వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రత్యేక కథనం ప్రచురిచింది. దీనితో విషయాన్ని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం వెంటనే ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈనేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా గ్రామ,వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత ప్రత్యేక కార్యదర్శిలు, కమిషనర్లను ఆదేశించారు. ఇందులో భాగంగా సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారు, ఇంకా పూర్తికాని వారు, జిల్లా పరిధిలోని బదిలీలు, అంతర్ జిల్లాల బదిలీలు, పరస్పర బదిలీలు(మ్యూచ్ వల్) తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని విధివిధానాలు, నిబంధనలను రూపొందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.25 లక్షల మంది ఉద్యోగులు 19 ప్రభుత్వ శాఖలకు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. వీరంతా మూడు దశల్లో అంటే రెందు దఫాలుగా నోటిఫికేషన్లు, మరికొందరు కారుణ్య నియామకాల ద్వారా విధుల్లోకి చేరారు. వీరిలో నోటిఫికేషన్ల ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులందరి సర్వీసులు ప్రొభేషన్లు ఖరారు అయ్యాయి. కారుణ్య నియామకాల ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు ఇంకా ప్రొభేషన్ ఖరారు కావాల్సి ఉన్నది. కాగా ఇటీవలే ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ విషయంలో అసెంబ్లీలో చట్టబద్దత తీసుకురావడానికి కేబినెట్ లో నిర్ణయించింది. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఉద్యోగులంతా విధుల్లోకి చేరి మూడేళ్లు దాటిపోవడంతో ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరిగా వీరికి కూడా బదిలీలు చేపట్టాలని ఉద్యోగు సంఘాల అభ్యర్ధన మేరకు అంగీకారం చెప్పింది. ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల్లోని సబార్డినేట్ సర్వీస్ రూల్సుని గ్రామ, వార్డు సచివాలయశాఖకు కూడా అమలు చేయాలి. కాకపోతే కొన్ని సాంకేతిక ఇబ్బందులు రావడంతో వీరికి ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ సైతం ప్రకటించారు.
ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులు మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఆన్ లైన్ విధానంలోనే ఆప్షన్లు ఏర్పాటుచేసి బదిలీలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దానికోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా రూపొందించనున్నారు. అక్కడే ఆప్షన్లు, స్థానిక బదిలీలు, అంతర్ జిల్లాల బదిలీలు, పరస్పర బదిలీలు, సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారికి ఒకలా, ఇంకా పూర్తికాని వారికి ఒకలా చేసే విధంగా నిబంధనలు రూపొందించే అవకాశాలున్నాయని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. ఈ బదిలీల ప్రక్రియ మొత్తం మూడు నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకోగా.. ప్రస్తుతం సచివాలయాల్లో పనిచేస్తున్న 19 ప్రభుత్వశాఖలకు చెందిన కమిషనర్లు, ప్రిన్సిపల్ కార్యదర్శిల నుంచి ఆయా ప్రభుత్వశాఖల సర్వీస్ రూల్స్ ను కూడా తెప్పించి క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.. ఈ బదిలీలన్నీ పారదర్శకంగా చేపట్టాలంటే ముందు ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండేవిధంగా విధివిధానాలు రూపొందించిన తరువాత ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కొన్ని రోజుల్లోనే తీపి కబురు బదిలీల ప్రత్యేక జీఓ ద్వారానే చెప్పే అవకాశం ఉంది...!