మే 6దాటినా ఇంకా పెన్షన్ల కోసం ఎదురుచూపులే


Ens Balu
26
Amaravati
2023-05-05 05:16:58

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ కోసం ప్రతీనెలా ఎదురుచూసే పరిస్థితే దాపురిస్తోంది. మే నెల 6వ తేదీ నాటికి కూడా వారి అకౌంట్ లో పెన్షన్లు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  రిటైర్డ్ ఉద్యోగులు వారి పెన్షన్ పైనే బ్రతుకుతు న్నారు. మరికొందరు పెన్షన్ పై హౌసింగ్ లోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశారు. వాటికి ప్రతీనెలా 5వతేదీ నాటికే ఈఎంఐలు కట్టాల్సి వుంది. దీనితో ప్రతీనెలా 5దాటిన తరువాత పెన్షన్లు పడటంతో ఈఎంఐకి ఇచ్చిన పోస్టు డేటెడ్ చెక్కులు బౌన్స్ అయ్యి వాటికి పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తమను పెన్షన్ల కోసం ఎదురు చూసేలా చేస్తోం దని కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోపక్క మరికొంత మంది పెన్షనర్లు కుటుంబాలు లేక ఒంటరిగా జీవిస్తుండటంతో వచ్చిన పెన్షను పైనే ఆధార పడాల్సి వస్తున్నది. అలాంటి వారు ప్రతీ నెలా పెన్షను వచ్చేంత వరకూ వేచిచూడకుండా ముందస్తుగా అప్పులు చేసుకొని, వాటి కి వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తున్నది. ఈవిధానం కొనసాగితే ప్రభుత్వంపై పెన్షనర్ల తిరుగుబాటు తప్పేటట్టు లేదు.

సిఫార్సు