ప్రపంచస్థాయిలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకం..


Ens Balu
2
Visakhapatnam
2020-09-27 15:58:03

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలపడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విఎంఆర్డీఎ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంనకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోటళ్లు, టూర్స్ అండ్ ట్రావెలర్స్, తదితర టూరిజానికి సంబందించిన వాటికి రిజిస్ట్రేషన్స్ ఏర్పాటు చేయడం జరుగిందన్నారు.  ప్రపంచంలో 30 శాతం దేశాలు టూరిజం మీదనే ఆదారపడ్డాయని చెప్పారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 12 పర్యాటక ప్రాంతాలను గుర్తించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అభివృద్థి చేయడం జరిగుతుందని, డిపిఆర్  కూడా తయారుచేయడం జరిగిందని, త్వరలోనే టెండర్లు పిలువడం జరుగుతుందన్నారు.  నూతన టూరిజం పాలసీని త్వరలోనే ప్రకటించబడుతుదని వెల్లడించారు.  అనుమతులు కోసం ఏ ఒక్కరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదని, పారదర్శకంగా ఉంటుందని, అనుమతుల కోసం సింగిల్ విండో  సిస్టం ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచనలో ఉందని పేర్కొన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు సందర్శించే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. పర్యాటకం ఒక బాధ్యతాయుతమైన రంగంగాను, ఆదాయం తీసుకువచ్చే శాఖగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.  పర్యాటకం అభివృద్థి చెందితే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.  విశాఖపట్నం ఎంతో సుందరమైన నగరమని, అంతర్జాతీయ పర్యాటక పటంలో విశాఖపట్నంను నిలపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.     ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి, మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్థి చెందితే ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.  ఈ యేడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం థీం  “పర్యాటకం అండ్ గ్రామీణాభివృద్థి” అని, రూరల్ టూరిజంలో విశాఖపట్నం జిల్లాలో ఏటికొప్పాక ప్రాంతం అభివృద్థికి అవకాశం ఉంటుందని చెప్పారు.  ప్రతీ జిల్లాలో పర్యాటక ప్రాంతంను గుర్తించి, స్థానిక సంస్కృతి, హెరిటేజ్ లపై చర్చించడం జరుగుతుందన్నారు.  ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్లను ప్రమోట్ చేయడానికి టూరిజం పాలసీని ప్రభుత్వం త్వరలోనే తీసుకువస్తుందని వెల్లడించారు.  రూరల్ టూరిజం, డోమెస్టిక్ టూరిజం అభివృద్థి చేయడం జరుగుందని వివరించారు. పర్యాటక రంగంలో రాష్ట్రానికి భారత ప్రభుత్వం నుండి అవార్డులు వచ్చినట్లు వివరించారు. రాష్ట్ర, ప్రపంచ, జాతీయ స్థాయిలో టూరిజం ప్రమోషన్ చేయడం జరుగుతుందన్నారు.     జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలోని ఏజన్సీలో పర్యాటక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో పర్యాటక ప్రాంతాలు, విశాఖపట్నంలో తొట్లకొండ, హెరిటేజ్, సహజ సిద్థంగా వచ్చిన అరకు, తదితర ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఈ యేడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం థీం “టూరిజం అండ్ రూరల్ డెవలప్ మెంట్” అని, ఏటికొప్పాక  ప్రపంచ, జాతీయ స్థాయిలో ప్రసిద్థి గాంచినదని చెప్పారు. లంబసింగిలో 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదౌతుందని, ఆ ప్రాంతానికి గుర్తింపు తీసుకువస్తే అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్థి పరచాలన్నారు.   కోవిడ్-19 నేపధ్యంలో పర్యాటక శాఖ మంచి సేవలు  అందించిందని ఆయన అభినందించారు.  రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ పర్యాటకంతోపాటు టెంపుల్ టూరిజం ఉత్తరాంధ్రాలో మరింత అభివృద్థి చేయవచ్చన్నారు. ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు.  శాసన మండలి సభ్యులు పి.వి.వి. సూర్యనారాయణ, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్ రాజ్ లు పర్యాటక ప్రాంతాల గూర్చి వివరించారు.  సన్ రే రిసార్ట్స్  అధినేత రాజబాబు, తదితరులు కోవిడ్-19 ను సందర్భంగా ఎదుర్కొన్న ఆటుపోట్లను వివరించారు.  అంతకు ముందు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం  హోటల్స్, రిసార్ట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ లకు రిజిస్ట్రేషన్ పత్రాలను సంబంధిత యజమానులకు మంత్రి అందజేశారు.    ఈ కార్యక్రమంలో  మాజీ శాసన సభ్యులు మళ్ల విజయ్ ప్రసాద్, రెహమాన్, చింతలపూడి వెంకటరామయ్య, విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిషోర్, టూరిజం రీజనల్ డైరక్టర్ రాంప్రసాద్, హోటల్స్, రిసార్ట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానులు, పర్యాటక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.