ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని 15522 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అందులో గ్రామ సచివాలయ ఉద్యోగులు 12464 మంది కాగా, వార్డు సచివాలయ ఉద్యోగులు 3058 మంది. అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారు 2476 మంది, స్పౌజ్ కోటా క్రింద 866, మ్యూచ్ వల్ బదిలీలు 1610 మంది ఉన్నారు. ఇక జిల్లాల్లో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నవారు 13046 మంది ఉద్యోగులు కాగా, అదర్స్ లో 8788 మంది ఉన్నారు. అత్యధికంగా రూరల్ పంచాయతీల్లో గ్రేడ్6 కార్యదర్శిలు(డిజిటల్ అసిస్టెంట్లు)1977 మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు 453 మంది, అత్యధికంగా మహిళా పోలీసులు 389 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక అవకాశం లేకపోయినా ఏడుగురు ఎనర్జీ అసిస్టెంట్లు కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కౌన్సిలింగ్ విధానం లేదా, ఉత్తర్వుల రూపంలో బదిలీలు చేపట్టనుంది.