"గుండమ్మ అల్లుళ్లకు" నేటితో 61 సంవత్సరాలు
Ens Balu
49
Visakhapatnam
2023-06-07 04:50:01
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు. విభిన్న పాత్ర పోషణలో వీరికి వీరే సాటి సమాన స్థాయిలో ఉన్న ఇద్దరు హీరోలు ఎవరు ప్రపంచ చలనచిత్ర స్థాయిలో వీరు కలిసి నటించినన్ని చిత్రాలు ఎవరు నటించలేదు. 61 సంవత్సరాల క్రితం వీరిద్దరూ కలిసి నటించిన "గుండమ్మ కథ" చిత్రం ఈరోజే విడుదల అయింది. విజయవాడ దుర్గా కళామందిర్ థియేటర్లో డైరెక్టుగా జూబ్లీ ప్రదర్శింపబడింది. మొదటి విడతలో 15 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. చిలకలూరిపేట, నరసరావుపేట వంటి కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. లేట్ రిలీజ్ కేంద్రాలతో కలిపి 20 కేంద్రాలకు పైగా శత దినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం పేరు పేరుకే "గుండమ్మ కథ". గాని వీరిద్దరి కాంబినేషన్లో రావడం మూలంగా "గుండమ్మ అల్లుళ్ళు" గానే భావించేవారు అప్పటి ప్రేక్షకులు, ప్రజానీకం, సినీ అభిమానులు.