ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కోసం నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక కౌన్సిలింగ్ పై ఉద్యోగులు డైలమాలో పడిపోయా రు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలపై స్పౌజ్, మ్యూచ్ వల్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇతరుల కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్నవారిని ప్రత్యేక అనుమానాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే కౌన్సిలింగ్ జూన్ 8,9,10 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే పాత ఉమ్మడి జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. బదిలీ లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కౌన్సిలింగ్ లో ప్రాంతాలు మార్చుకోవడానికి వీలుపడుతుందా..? లేదంటే ప్రభుత్వ శాఖలు చూపించిన ఖాళీల్లోనే చేరాల్సి వుంటుం దా..? ఆరోగ్య సమస్యలు, స్పౌజ్ కోటాలో దరఖాస్తు చేసుకున్నవారికి నచ్చిన ప్రదేశాలు ఎంపిక చేసుకునే అవకాశం వుందా..? అనే అనుమానాలు ఉద్యోగులును వెంటాడుతున్నాయి. అంతేకాకుండా కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో సిటిలుగా వున్న ప్రాంతాల్లో పోలీస్ కమిషనరేట్ లు ఉన్న చోట జిల్లాల్లో జిల్లా పోలీసు కార్యాలయాలు తొలగించారు.
దీనితో మహిళా పోలీసులకు సంబంధించిన కౌన్సిలింగ్ జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో జరుగుతుందా, పోలీసు కమిషనరేట్ పరిధిలో జరుగుతుందా అనేది కూడా తేలలేదు. కమిషనరేట్ లు లేని చోట్ల జిల్లా ఎస్పీలే ఉంటారు కనుక కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు ఉండవు. కానీ విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి పక్క జిల్లాల్లో జిల్లా పోలీసు కార్యాలయాలు ఉన్నాయి. వీరికి అక్కడ బదిలీలు జరుగుతాయా అనేది తేల లేదు. రేపటి నుంచే కౌన్సిలింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నవారెవరికీ నేటికి ఆయా ప్రభుత్వశాఖల నుంచి సమాచారం రాలేదు. ఎక్కడ కౌన్సిలింగ్ కి హాజరు కావాలో కూడా తెలియకఉద్యోగులందరూ డైలమాలో ఉన్నారు. అయితే వారి మాత్రుశాఖల అధికారులు మాత్రం అందరికీ కేటాయించిన ఉమ్మడి జిల్లా శాఖల కార్యాలయంలోనే బదిలీలు జరుగుతాయని..సెల్ ఫోన్లకు సమాచారం, మెసేజులు వస్తాయని చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది.