ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మిగులు ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీచేసేందుకు కసరత్తు ప్రారంభం అయ్యింది. దానికోసం త్వరలో ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనాలని ప్రభుత్వం భావిస్తుందట. దానికంటే ముందుగా రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లో పనిచేస్తూ..విధినిర్వహణలో మరణించిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల క్రింద సచివాలయాల్లోనే ఉద్యోగాలు కల్పించడం ద్వారా కొంత భర్తీని చేపట్టి ఆ తరువాత మిగులు ఉద్యోగాను భర్తీచేయాలని అధికారులు యోచిస్తున్నారు. గ్రామ,వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో పాత 13 జిల్లాలు, విభజన 26 జిల్లాల వారీగా ఖాళీలను ఇప్పటికే జిల్లా అధికారులు గుర్తించారు. ఆయా ఖాళీలను భర్తీచేయడానికి కారుణ్య నియామకాల్లో భర్తీచేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. ముఖ్యంగా కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీచేయడం ద్వారా ప్రజలకు సచివాలయాల ద్వారా సేవలు అందించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే చాలా జిల్లాల్లో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బదిలీల ప్రక్రియ పూర్తి అయ్యేనాటికి ఖచ్చితంగా మిగిలిన ఖాళీలను భర్తీచేయడానికి చర్యలు తీసుకోవాలని..దానికోసం పరిపాలనా పరమైన అనుమతుల కోసం పంపామని రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామవార్డు సచివాలయాల్లో అత్యధికంగా వెటర్నరీ అసిస్టెంట్లు ఖాళీలు అధికంగా ఉండగా.. తరువాత స్థానంలో హార్టికల్చర్, మహిళా పోలీసుల, పంచాయతీ కార్యదర్శిలు, డిజిజల్ అసిస్టెంట్లు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేసేస్తే ప్రభుత్వం నియమించాలనుకున్న 1.35 లక్షల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీచేసినట్టు అవుతుంది. ఉద్యోగాలు పొందిన వారే వివిధ ప్రభుత్వ శాఖల్లో సచివాలయ ఉద్యోగాల కంటే మంచి ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ఇలా ఏర్పడిన ఖాళీలు సుమారు 15 నుంచి 18వేల వరకూ ఉంటాయని తెలుస్తుంది. అంతేకాకుండా 2023 డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2వేల ఖాళీలు ఇదేశాఖలో ఉద్యోగ విరమణల ద్వారా ఏర్పడనున్నాయని సమాచారం. 2024 ఏప్రిల్, మే, నాటికి ఒక్క పంచాయతీ కార్యదర్శిలే 1300 మంది ఉద్యోగ విరమణ చేయననున్నారు. అదీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచడంతో వీరి ఉద్యోగాలు అప్పటి వరకూ ఉండనన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని సచివాలయాలు కార్యదర్శదర్శితోపాటు ముగ్గురు, నలుగురు సిబ్బందితోనే నడుస్తున్నాయి. అందులో ప్రాధాన్యత కలిగిన వీఆర్వో, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్ తదితర పోస్టులను సాధ్యమైనంత త్వరగా కారుణ్య నియామకాల కోటాలో భర్తీచేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఏ శాఖలో ఉద్యోగి మ్రుతిచెందినా..దానికి సంబంధించిన పోస్టింగులను ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే భర్తీచేస్తుండటం విశేషం. మరోవైపు ఏపీపోలీసుశాఖలో తీసిన నోటిఫికేషన్ లోని ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా చాలామంది ప్రిలిమినరీ పరీక్షను సచివాలయ ఉద్యోగులు అధిగమించారు. మిగిలిన రెండు పరీక్షల్లోనూ విజయం సాధిస్తే మరికొంత మంది సచివాలయ సిబ్బంది పోలీసుశాఖలోకి వెళ్లిపోనున్నారు. అపుడు మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఒకరకంగా అలా సిబ్బంది వెళ్లిపోతారనే కారణంతోనే పోలీసు నియామక ప్రక్రియ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేసి ప్రభుత్వం మిగిలిన రెండు దశల పరీక్షలను చేపట్టడం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది. సచివాలయాల్లో ప్రధానశాఖల సిబ్బంది ఖాళీలు భారీగా ఏర్పడితే సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని ముందుగానే ఊహించిన ప్రభుత్వం కారుణ్య నియామకాల్లోనే ఎక్కువ మందిని భర్తాచేయాలని చూస్తుంది. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ నాటికి మిగులు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేయాలని కార్యాచరణ చేపడుతున్నది. నోటిఫికేషన్ వస్తే నిరుద్యోగులకు మళ్లీ కొలువుల పండుగ వస్తుంది..!