ఎస్ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుకూడా ఎన్నికలముందేనా..?!


Ens Balu
145
మంగళగిరి
2023-06-12 06:59:01

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీచేయాలనుకున్న 411 ఎస్ఐ, 6511 కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ కొనసా...గుతూ వస్తోంది. అభ్యర్ధులకు ప్రలిమినరీ పరీక్ష పెట్టి ఫలితాలు విడుదలచేసి.. త్వరలోనే ఫిజికల్ టెస్టు ఉంటుందని చెప్పి ఊరుకున్న బోర్డు అధికారులు ఆ దిశగా కన్నెత్తి చూడలేదు. దీనితో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులంతా ప్రతినిత్యం ఫిజికల్ టెస్టు కోసం ప్రాక్టీసు చేస్తూ ఉండాల్సి వస్తుంది. సాధారణంగా ప్రిలిమినీ పరీక్షపూర్తయిన 2 నెలలకు ఫిజికల్ టెస్టు నిర్వహిస్తారు. అది పూర్తియిన 2 నెలలకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రక్రియ మొత్తం అంటే ఉద్యోగ ప్రకటన దగ్గర నుంచి అన్ని పరీక్షలు పెట్టిని ఎంపికైన వారిని పోలీసు శిక్షణకు పంపడానికి అయ్యే ఆరునెలల్లోపుగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీచేయబోయే ఉద్యోగాలకు ఇప్పటి వరకూ ప్రిలిమినరీ పరీక్ష, ఆతరువాత ఫలితాల ప్రక్రియ మాత్రమే పూర్తయింది. దానికే ఆరునెలల సమయం పట్టేసింది. అంటే మిగిలిన 2 టెస్టులు ఇంకెప్పుడు పూర్తవుతాయోనని అభ్యర్ధులు దిగాలు పడిపోతున్నారు.

మిగిలిన రెండు పరీక్షలే అత్యంత కీలకం!
పోలీసు ఉద్యోగ నియామకాల ప్రక్రియ గతంలో 2 దఫాలుగా మాత్రమే ఉండేవి. అయితే ఉద్యోగాలు తక్కువ, అభ్యర్ధులు ఎక్కువగా దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను 3 దఫాలుగా చేపడుతున్నారు. అందులో ప్రిలిమినరీ పరీక్షలోనే చాలా మంది ఫిల్డర్ అయిపోతున్నారు. తరువాత జరిపే దేహదారుడ్య పరీక్షలో తొలిపరీక్షలో ఉత్తీర్ణులైనవారిలో సగానికిపైనే ఫిల్టర్ అయిపోతున్నారు. ఆపై ఫైనల్ పరీక్షలో ఎన్ని ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఇచ్చారో అంతే మంది మిగులుతున్నారు. ఇదంతా ప్రభుత్వం నియామకప్రక్రియను ఒక పద్దతి ప్రకారం చేపడినపుడు జరిగే తంతు. కానీ ఈ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలకు ప్రకటన, ఆపై పరీక్షల నిర్వహణ అంతా గాలిలో దీపంలా ఉంటుందని అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2022 డిసెంబరులో వచ్చిన పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు ఫిబ్రలో ప్రిలిమినరీ పరీక్ష పెట్టి, ఆపై వెంటనే ఫలితాలు ఇచ్చేసి నేటి వరకూ ఊరకుండిపోయారు. ఇప్పటికే ప్రక్రియ జరిగి ఆరునెలలు గడిచిపోయాయి. మిగిలిన పరీక్షలు ఎప్పుడు పెడతారో తేలని పరిస్థి నెలకొంది.

ఎన్నికల ముందు హడావిడిగా మిగిలిన పరీక్షలు?
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా 8నెలలు సమయం ఉన్నందున ఎన్నికలకు ఐదు నెలల ముందు మిగిలిన దేహదారుడ్య పరీక్ష, ఫైనల్ ఎగ్జామ్ పెట్టి.. ఆపై ఎన్నికలు పూర్తయిన తరువాత కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపికైన వారిని శిక్షణకు పంపిస్తారా అంటూ అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దేహదారుడ్య పరీక్షపూర్తయితే ఎంతమంది ఫైనల్ ఎగ్జామ్ కి క్వాలిఫై అయ్యారో తెలిసేదని..ఒకవేళ ఈ ఉద్యోగం రాకపోతే, ప్రభుత్వం తీయబోయే మిగిలిన ఉద్యోగాలకైనా సిద్దం కావడానికి అవకాశం వుంటుందని అభ్యర్ధులు వాపోతున్నారు. ఈ విషయంలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన వారంతా తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్ధులను ద్రుష్టిలో ఉంచుకొని మిగిలిన 2 దశల పరీక్షల పరీక్షలు నిర్వహించి నియామకప్రక్రియ పూర్తిచేయాలని కోరుతున్నారు. చూడాలి పోలీసు నియామకాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!