ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఎస్ఓపిని విడుదల చేసింది. ఈమేరకు ఆశాఖ డైరెక్టర్ ఆర్సీ నెంబరు-238 విడుదల చేశారు. ఐదు రకాల బదిలీల కోసం కావాల్సిన పత్రాలను తెలియజేస్తూ లేఖలో ఉటంకించారు. 1)మ్యూచువల్ కౌన్సిలింగ్ కి దరఖాస్తు చేసుకునేవారు నో డ్యూస్ సర్టిఫికేట్స్, 2)స్పౌజ్ కోటా క్రింద దరఖాస్తు చేసుకున్నావారు వివాహ రిజిస్ట్రేషన్ పత్రం, స్పౌజ్ సర్టిఫికేట్,ఎంప్లాయి ఆథరైజేషన్, ఎంప్లాయి ఐడి, స్పౌజ్ ఆధార్, 3)సింగిల్ ఉమెన్ లేదా విడో, డైవర్సీ కి సంబంధించిన సర్టిఫికేట్, 4)మెడికల్ గ్రౌండ్స్ క్రింద దరఖాస్తు చేసుకున్నవారు రాష్ట్ర, లేదా జిల్లా మెడికల్ బోర్డు ద్రువీకరించిన మెడికల్ సర్టిఫికేట్, 5)వికలాంగుల కోటా క్రింద దరఖాస్తు చేసుకున్నవారు బోర్డు ద్రువీకరించిన సర్టిఫికేట్ సమర్పించాల్సి వుంటుంది. అదే సమయంలో ఎవరైనా నకిలీ ద్రువీకరణలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.
అభ్యర్ధులకు ముందుగా కేటాయించిన ప్రదేశాలను ఆన్ లైన్ లో 14న ఆయా జిల్లా కలెక్టర్లు తెలియజేస్తారు. అభ్యర్ధులు నేరుగా కౌన్సిలింగ్ 15న సంబంధిత ద్రువీకరణ పత్రాలతో హాజరు కావాల్సి వుంటుంది. ఈ మేరరకు లైన్ డిపార్ట్ మెంట్స్(ప్రభుత్వ శాఖలు) జిల్లా అధికారులు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. అభ్యర్ధులకు సమాచారం తెలియజేయాల్సి వుంటుంది. మొదటి ప్రాధాన్యత మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్( జిల్లా, అంతర్ జిల్లాలు) కి ఇచ్చిన తరువాత, వికలాంగులు, మందబుద్ది కలిగిన తల్లిండ్రులకి, ఆ తరువాత మెడికల్ గ్రౌండ్స్, సింగిల్ ఉమెన్, విడో, తరువాత స్పౌజ్ లోకల్ జిల్లా, స్పౌజ్ అంతర్ జిల్లాలకు, ఆపై ఇతరులకు కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు.