డిఎస్సీ 98కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసు రెవిన్యువల్


Ens Balu
35
Tadepalli
2023-06-14 09:33:15

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నియమించిన డిఎస్సీ 98 కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసు మరో 11 నెలలు రెవిన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరికి ఒక నెల నో వర్క్..నోపే విధానం అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రెవెన్యువల్ చేసిన ఉత్తర్వులు జూన్1 నుంచి 2024 ఏప్రిల్ 30 అమలులో ఉంటాయి. కాగా ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో అయితే చేరారు తప్పితే వారికి జీతాలు ఇవ్వడానికి వీలుగా వారి ఐడెంటిటీ, మరియు సేలరీలు మంజూరు చేసేందుకు వారికి హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ లు, ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపుకార్డులు తయారు చేయలేదు. వాటి బాధ్యత రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ఎంఈఓలకు ప్రభుత్వం అప్పగించినా నేటి వరకూ ఆపని పూర్తికాలేదు. దానితో విదుల్లోకి చేరిన ఉపాధ్యాయులందరికీ నేటికీ జీతాలు అందలేదు. రాష్ట్రస్థాయిలో కొందరు ఉపాధ్యాయులకు మాత్రం ఈ హెచ్ఆర్ఎంఎస్ ఐడీలను పాఠశాల విద్యాశాఖ అధికారులు క్రియేట్ చేశారు.
సిఫార్సు