గ్రామ, వార్డు సచివాలయశాఖ రాష్ట్ర అధికారుల ముందుచూపు లేమి..అప్పటికప్పుడే తీసుకున్న అత్యవసర నిర్ణయాలు ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. అంతర్ జిల్లాల మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్ లు దరఖాస్తు చేసుకున్నవారిని 15 తేదినాటికి పాత ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్లకు, జిల్లా ఎస్పీ కార్యాలయాలకు రావాలంటూ జిల్లా కలెక్టర్ల నుంచి సర్క్యులర్ లు 13న జారీ అయ్యాయి. దీనితో 14వ తేదీ సాయంత్రానికే ఉద్యోగులు మ్యూచవల్ ట్రాన్స్ ఫర్లు పెట్టు కున్న జిల్లాలకు వెళ్లిపోయారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్సులో 15వ తేదిన ఒక్క స్థానిక జిల్లాల ఉద్యోగులకు మాత్రమే బదిలీలు చేపట్టాలని.. అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారికి కౌన్సిలింగ్ ఎప్పుడు పెట్టేది త్వరలోనే తెలియజేస్తామరని చెప్పడంతో. జిల్లాలకు చేరుకున్నవారంతా చచ్చినట్టు ఉసూరు మంటూ వెనుతిరగాల్సి వచ్చింది. వాస్తవానికి నాలుగు కేటగిరీల్లో బదిలీలకు ఒకేరోజు చేస్తామని జిల్లా కలెక్టర్లు జారీచేసిన సర్క్యులర్ లలో పేర్కొనడం విశేషం.
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, శ్రీకాకుళం నుంచి రాజమండ్రి, కాకినాడ నుంచి విజయనగరం, కడప నుంచి తిరుపతి, చిత్తూరు నుంచి గుంటూరు, విశాఖపట్నం నుంచి కాకినాడ తదితర జిల్లాలకు మ్యూచవల్ ట్రాన్స్ ఫర్లు పెట్టుకున్నవారంతా మళ్లీ వ్యవయప్రయాలకోర్చి వెనుతిరిగారు. మరికొంత మంది ఉద్యోగులు వెనక్కి వెళ్లలేక మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వచ్చిన జిల్లాల్లోనే ఉండిపోయారు. 15వ తేదిన కేటగిరీల వారీగా సమయం, ప్రదేశం ఇచ్చి సంబంధిత పత్రాలకు రావాలని ఉత్తర్వుల్లో పేర్కొని అప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయం మార్చేస్తే ఎలా అంటూ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయశాఖ విభాగానికి చెందిన డిఎల్ డిఓల ద్రుష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం చెప్పినట్టు తాము చేయాలి తప్పితే ఉద్యోగు పక్షాన తాము ఏమీ చేయలేమంటూ సెలవిచ్చారు.