గోవింధరాజస్వామి రథానికి ఏమీ కాలేదు.. టిటిడి


Ens Balu
13
Tirupati
2023-06-16 09:15:32

"తిరుపతి గోవిందరాజస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా ఏమీకాకుండా నిక్షేపంగా ఉన్న రథం ఫోటోను కూడా శుక్రవారం మీడియాకి ఫ్యాక్ట్ చెక్ పేరుతో విడుదల చేశారు."తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయింది తప్ప గోవిందరాజు స్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని..ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలియజేశారు. కాగా సోషల్ మీడియాలోనూ, కొన్ని మీడియా సంస్థల్లోనూ వస్తున్నట్టు ఏమీ జరగలేదన్నారు. రథానికి బధ్రత ఉందని తెలియజేసిన టిటిడి తప్పుడు వార్తలు ప్రచారం చేసి భక్తులను ఆందోళనకు గురిచేయొద్దని కోరింది.
సిఫార్సు