ఈఎన్ఎస్ కథనాలపై స్పందిచిన ప్రభుత్వం.. పీఆర్సీ అరియర్స్ విడుదల..!


Ens Balu
328
Amaravati
2024-02-23 13:21:53

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్ పడ్డాయి.. ఏంటి నమ్మసక్యంగా లేదా కావాలనుకుంటే సచివాలయ ఉద్యోగులనే అడగండి. ఈఎ న్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా  సచివాలయ ఉద్యోగుల పీఆర్సీ ఇబ్బం దులపై ప్రచురించిన కథనాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించింది. సర్వీసు రెగ్యులర్ అయి, ఇంక్రిమెంటు తీసుకున్న రెగ్యులర్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు పీఆర్సీ అరియర్స్ మొత్తాలను సిబ్బంది బ్యాంకు ఖాతాలకు జమచేస్తోంది ప్రభుత్వం. వాస్తవానికి 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే సచివాలయ ఉద్యోగులకు కూడా వెంటనే పీఆర్సీ అరియర్స్ మంజూరు చేయాల్సి వుంది. కానీ ప్రభుత్వం మంజూరు చేయలేదు. నాటి నుంచి నేటి వరకూ వివిధ రూపాల్లో సచివాలయ ఉద్యోగుల సమస్యలను, ఆర్ధిక ఇబ్బందులను వివిధ వార్తా కథనాల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనితో స్పందించిన ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ అరియర్స్ మొత్తాలను జమచేస్తున్నది. ప్రభుత్వం ఇపుడు సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్ ను జమచేయకపోతే..వచ్చే పీఆర్సీ ప్రయోజనాలు సచివాలయ ఉద్యోగులు పొందే వీలుండదు. ఆ సాంకేతిక కారణాన్ని ఉటంకిస్తూ వార్తా కథనాలను అందించింది  ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ. దీనతో ఉద్యోగులకు విడతల వారీగా బకాయిలను ప్రభుత్వం జమచేస్తున్నది.

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం పెంచిన సేవలు, ఉద్యోగుల ఆనందం తోపాటు ఇబ్బం దులను కూడా ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రమే ప్రత్యేకంగా ప్రత్యేక కథనాల ద్వారా ప్రస్తావిస్తూ వస్తోంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 1.34లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారాన్ని కూడా ఎప్పటి కప్పుడు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తమ సమస్య పరిష్కారం అయి పీఆర్సీ అరియర్స్ బ్యాంకు ఖాతాలకు జమకావడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వారి ఆనందాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్లు చేసి మరీ పంచుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఆంధ్రప్రదేశ్ లో2019లో ఏర్పాటైన దగ్గర నుంచి ప్రతీ తాజా సమాచారాన్ని ప్రముఖంగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రమే అందిస్తూ వస్తున్నది.  ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్ మంజూరు కాకపోతే వచ్చే పీఆర్సీలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనితో స్పందించిన ప్రభుత్వం ఆఖరి క్యాబినెట్ సమావేశం పూర్తయి ప్రభుత్వం టైమ్ పూర్తయ్యేలోపు ఉద్యోగులందరికీ పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలని నిర్ణయించుకొని వడి వడిగా ఆ మొత్తాలను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమం చేపట్టింది.

ఇదే సమయంలో ఉద్యోగులకు సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో రావాల్సిన రెండు ఇంక్రిమెంట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తే వచ్చే పీఆర్సీలో తమకు ప్రయోజనం చక్కగా కనిపిస్తుందని ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని తమ ఆనందం పంచుకోవడానికి ఫోన్లు చేసే సమయంలోనూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ముఖ్య ప్రతినిధి దృష్టికి తీసుకు వస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని పలుమార్లు ప్రత్యేక కథనాల్లో రాశామని, మళ్లీ ఈ విషయాన్ని మరో కథనం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని సచివాలయ ఉద్యోగుల ఫోన్ కాల్స్ కి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ముఖ్య ప్రతినిధి సమాధానం ఇస్తున్నారు. అందులోనూ సచివాలయ ఉద్యోగులు, అసోసియేషన్లు తమ డిమాండ్ లను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి కాకుండా ప్రత్యర్థి పార్టీల దృష్టికి తీసుకెళుతున్న విషయాన్ని కూడా బహిర్గతం చేయడంతో ప్రభుత్వం కూడా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ప్రయోజనాలు అందించాలని చక చకా ఫైళ్లను ముందుకి కదుపుతున్నది. ఆఖరి క్యాబినెట్ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖకు చట్టబద్దత, మిగిలిపోయిన శాఖలకు సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్ విషయం కూడా క్లియర్ చేయాలనే యోచనతో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అదే జరిగితే 74 ప్రభుత్వశాఖల మాదిరిగా 75వ ప్రభుత్వశాఖగా జతైన గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు కూడా అన్ని ప్రయోజనాలు రావడానికి మార్గం సుగమం అవుతుంది. 

ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రచురించిన కథనాలపై గతంలో ఎన్నో విషయాలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరోసారి స్పందించి ఉద్యోగులకు మేలు చేయడం అభినందనీయం. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం అంటే అక్షర సత్యమని, అందులో ఎలాంటి స్వప్రయోజనమూ ఉండదని..మంచి చేసే ప్రభుత్వ సేవలను కీర్తిస్తూ..అదే సమయంలో ఉద్యోగులు ఇబ్బందులు పడితే ఆ వాస్తవాలను బయట పెట్టడంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎల్లప్పుడూ ముందే వుంటుందని మరోసారి తెలియజేస్తున్నాం. ఏపీలో ప్రభుత్వశాఖల్లోని సమస్యలే కాకండా ప్రభుత్వం అందించే ప్రయోజనాల విషయంలోనూ ప్రత్యేక కథనాలు త్వరలోనే ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అదే సమయంలో కొందరు రాజకీయనేతలు, తేడాగాళ్లు చేసే బెదిరింపులకు, ఫోన్ కాల్స్ కి కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎక్కడా భయపడదని కూడా హెచ్చరిస్తున్నాం. వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి ప్రత్యేక కథనం ద్వారా తీసుకెళ్లడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే మంచి కోణాన్ని మాత్రమే చూడాలని..అంతే తప్పా ఏ మీడియాకి అందని సమాచారం ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి మాత్రమే ప్రత్యేకంగా వస్తుందని, దానిపై ప్రభుత్వం స్పందిస్తుందని.. ఒక్కోసారి జీఓలు కూడా విడుల చేసేస్తున్నదని ఏడ్చే వారి వలన ఉద్యోగులకు,  కడుపుమంటతో ఉండే మీడియాలకు, వాటి ప్రతినిధులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ప్రజల నాడి మాత్రమే ప్రభుత్వం దృష్టికి వార్తల రూపంలో తీసుకెళతాం తప్పా మరేఇతర స్వప్రయోజనం ఉండదని సవినయంగా తెలియజేస్తున్నాం..!