ఆయుష్ లో పుచ్చకాయల దొంగలు బుజాలు తడుముకోవడం మొదలెట్టారు.. చేసిన, చేస్తున్న తేడా పనులపై ప్రధాన మీడియాలో వరుస కథనాలు వచ్చేస్తుంటే.. తట్టు కోలేని అధికారులు తమ ఉనికిని, మంచి అనే ముసుగు కప్పుకోవడానికి తెరచాటు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయుష్ విభాగాన్ని గాడిలో పెట్టాలని ప్రయత్ని స్తుంటే..అదేదో బ్రహ్మకపాలం పగిలిపోయినట్టుగా మీడియాలో వాస్తవాలు బయట పెట్టేస్తున్నారని.. మందలిస్తే మండిపడిపోతున్నారని.. బుద్ధి చెబితే కక్షగట్టినట్టుగా కథనాలు రాస్తున్నారని.. జూమ్ మీటింగ్ లో ఏదో ఓ మాటంటే.. అమ్మనా బూతులు తిట్టారని.. అవసరానికి డబ్బులు తీసుకుంటే మామూళ్ల రంగు పులిమారని.. డ్రైవర్ ఉద్యోగం పోకుండా కాపాడితే.. తేడాగా వ్యవహరించామని తెగ వ్యతిరేక వార్తలు రాసేస్తున్నార్రా బాబూ.. ఇలాగైతే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అక్షింతలు తప్పవని భావించిన అధికారలు తమకు అనుకూలంగా ఉన్న భజన పరులతో భజన చేయించుకునే ఘట్టానికి తెరలేపారు. ఆయనొచ్చిన తరువాత ఆయుష్ విభాగం గాడిలో పడిపోయిందని..ఆహా ఓహో అంటూ భజన వార్తల వంటకాలు మొదలెట్టారు.. ఒక్కసారి ఆయుష్ కమిషనర్, అయనకి అనుకూలంగా ఉన్న ఆర్డీడీలు చేసిన తేడా వ్యవహారాలు.. ఇదేశాఖలోని తేడా పనులు, ఘనకార్యాల కోసం.. భజన మొదలెట్టిన భజన బృందాల కోసం వాస్తవాలు మళ్లీ ఒక్కసారి గుర్తుచేసే ప్రయత్నం చేద్దాం..!
పుచ్చకాయ దొంగలెవరంటే నేను కాదని బుజాలు తడుముకున్నారట వెనకటికి.. చేసిన తప్పులను..వేధింపులను మీడియా బట్టబయలు చేస్తే.. నేను అలా చేయలేదని.. విధులకు రాని వైద్యులతో పనిచేయించే ప్రయత్నం చేస్తున్నానని ప్రచారం చేయించుకునే మొదలు పెట్టారని వేధింపులకు గురవుతున్న వైద్యులు తీవ్రంగా ఆరోపిస్తు న్నారు. ఆయుష్ లో మోనార్క్ గా.. తన మాటే చెల్లాలన్నట్టుగా వ్యవహరించే కమిషనర్ డా.ఎస్బీ.రాజేంద్రకుమార్ లంగిశెట్టితో పెద్ద లంపటమే వచ్చి పడిందని గగ్గోలు పెడుతున్నారు వైద్యులు. కొందరైతే ఏం జరిగితే జరిగిందని తమ పేర్లతో నేరుగా సీఎంఓకి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదులు కూడా చేశారు. ఆయుష్ కమిషనర్ సారు చేసే ఘనకార్యాలు ఏంటో ఒక్కతెలుసుకుంటే.. వేళా పాలాల లేకుండా జూమ్ మీటింగ్లు పెట్టి.. వైద్యులనే కనీసం గౌరవం కూడా లేకుండా ఏరా.. రాస్కెల్స్.. పనిచేయడం చేతకాదా అని తిట్ల దండకం చేయడం(సదరు జూమ్ మీటింగ్ వీడియోలు, తిట్ల పురాణాలు వినాలని, చూడాలని ఉంటే అవీ అందిస్తాం తీసుకొని భజవార్తల రూపంలో వేసే దమ్ముందా..?).. డిస్పెన్సరీలో మొక్కలు ఎదగకపోతే దానికి అక్కడి వైద్యులను బాధ్యులను చేసి పనిష్మెంటుగా విజయవాడ కమిషనర్ కార్యాలయానికి వివరణ ఇవ్వడానికి రమ్మనడం, అక్కడాకూడా అఖితభారతస్థాయి అధికారిననే హోదా మరిచిపోయి చాలా చీఫ్ గా మాట్లాడటం..
ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాల్సిన డిస్పెన్సీరీ ఫర్నిచర్ కు వైద్యాధికారులను ఆ బిల్లులు చెల్లించమనడం, ఏకపక్షంగా ఆలోచిస్తూ ఏకంగా పదుల సంఖ్యలో ఉద్యోగాల ను రద్దు చేయడం.. ఎస్సీ ఎస్టీ సీనియర్ వైద్యాధికారులకు దక్కాల్సిన పదోన్నతులు దక్కకుండా రోస్టర్ పాయింట్లను చేరకుండా సదరు పోస్టులను రద్దు చేయడం (అడ్డదారి జీఓలు చేయించడం..ఈ కాపీ మేము ఇవ్వాల్సిన పనిలేదు చెమ్చాలుగా పనిచేసే అధికారులు వద్దనే ఉన్నాయి.. కాదూ కూడదు..కావాలంటే అవీ ఇస్తాం), తన చెప్పుచేతల్లో ఉండే ఆర్డీడీలతో సమాచారం తెప్పించుకుని మరీ వైద్యాధికారులను మానసికంగా వేధించం ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇవేవో ‘ఈరోజు’ చెబుతున్న మాటలు కాదు..ఆయుష్ లోని వైద్యులంతా తమను ఏవిధంగా కమిషనర్ చిత్ర హింసలకు గురిచేస్తున్నారో వివరిస్తూ వైద్యాధికారులే సీఎంఓ, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి చేసిన ఫిర్యాదు వివరాలు(కావాలనుకుంటే..సదరు కాపీ భజనపరులకు అందజేస్తాం..ఇపుడు చేస్తున్న భజనలానే..దానిని కూడా ముద్రించి భజన చేయగలరా..?)..అన్నింటి కంటే ముఖ్యంగా ఐదేళ్ల పాటు సక్రమంగా విధులకు హాజరు ఇదేశాఖలోని ఒక డ్రైవర్ కి ఉద్యోగం పోకుండా చేసినందకు తీసుకున్న లంచాలు(సదరు వైద్యుడి బ్యాంకు ఖాతాల నుంచి ఏ రోజు ఎంతెంత మొత్తం పంపారో లెక్కలు, బ్యాంకు స్టేట్ మెంట్లు కావాలంటే ఇస్తాం..లేదంటే మీరు విచారణ చేసినా వాస్తవాలు కండబద్దలు కొట్టుకొని మరీ బయటకు వచ్చేస్తాయి),
ఇదే కేసు విషయంలో ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ ను విధుల నుంచి తప్పించడానికి.. ఓ కుటుంబం వీధినిన పడటానికి జాబ్ రిమూవ్ ప్రపోజల్ ఫైలు ఏ విధంగా పెట్టారనే విషయానికి సంబంధించిన సమాచారం..ప్రస్తుతం నడుస్తున్న తంతుకి సంబంధించిన సమాచారం అన్ని ఆధారాలూ ఉన్నాయి..అంతేకాకుండా వైద్యాధికారుల వద్ద నుంచి జోన్-1లో పనిచేసిన ఆర్డీడీ డా..శేఖర్ వైద్యాధికారుల నుంచి ఎన్ని లక్షలు అప్పులు చేసి ఎగ్గొట్టారో వాటి బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఫోన్ పే రిసిప్ట్ లు ఇలా చాలాపెద్ద రికార్డే ఉంది కావాలంటే అవీ ఇవ్వగలం(వాటిపై భజన చేసే తెగువ చూపించగలరా?).. ఈ విషయాలన్నింటిపై మీడియాలో ఆధారాలతో వార్తల వస్తే..ఆయనొ చ్చిన తరువాత ఆయుష్ ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారనే భజన ఎలా చేయాలనిపిస్తున్నదో వారికే తెలియాల్సి వుంది. వైద్యులను తిట్టడం వాస్తవం కాదా.. కమిషనర్ పేరుతోనూ, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి హెచ్చరికలను అడ్డుపెట్టుకొని తన చెల్లికి పెళ్లి, అమ్మకు వైద్యం అంటూ మెడికల్ ఆఫీసర్ల దగ్గర జోన్-1 ఆర్డీడీ అప్పులు చేసి నేటికీ తీర్చకుండా వైద్యాధికారులును పరిపాలనా పరమైన అంశాలను జోడించి ముప్పు తిప్పలు పెట్టడం వాస్తవం కాదా..? రాష్ట్రప్రభుత్వం పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఉత్తర్వులు ఇస్తే ఏకంగా 12 మందిని గాల్లో పెట్టి వారి ఉద్యోగాలు రెగ్యులర్ కానీయకుండా చేయడం నిజం కాదా..? దానిపై ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు ప్రపోజల్ ఫైల్ పెట్టాలని ఆదేశించినా కొర్రీలు వేసి.. ప్రభుత్వ ఉత్తర్వులను అపహాస్యం చేస్తూ.. దానిని పక్కన పెట్టేయడం నిజం కాదా..?
ఏది నిజమో.. ఏది అబద్దమో భజన చేసేవారు రంగంలోకి దిగి విచారణ చేస్తే వాస్తవాలన్నీ ఆధారాలతో బయటకి వచ్చేస్తాయి. ప్రశ్నించిన వారిపై కక్ష గట్టడం కాదు..చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు తేడా ప్రచారం మొదలెట్టడం అంతకంటే కాదు.. వాస్తవాలను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే ఏ మీడియాకైనా గౌరవం వుంటుంది. అలాని మీకుండే అవసరాలు, కారణాలు, అధికారుల తప్పులను కప్పిపుచ్చడానికి వాడితే.. ఆధారాలు బయటపడిన రోజున తెల్లమొహం వేయాల్సి వస్తుంది.. మీ ముందుంచిన అంశాలపై నిష్పక్షపాతం విచారణ చేసే దమ్ముందా..? ఆధారాలిస్తాం.. వాస్తవాలు నిర్భయంగా రాయగలరా..?తేడా అధికారులకు తెలిసీ తెలియని ప్రచారం చేస్తే ఉన్న పరువు.. ఉంచుకున్న పరువూ రెండూ పోతాయ్.. మళ్లీ చెబుతున్నాం.. చేసిన తప్పులను మాత్రం ఇప్పటి వరకూ బయట పెట్టాం.. చేసిన తప్పులను సరిదిద్దుకున్నా.. నిష్పక్షపాతం వ్యవహరించి అన్యాయం జరిగిన వారికి న్యాయం చేసినా..ఇంతకంటే కీర్తిస్తూ కూడా వార్తలను అందిస్తాం. శభాష్ అంటూ గౌరవిస్తాం.. ఉన్నతాధికారులంటే ఎంతో ఉన్నతంగా వ్యవహరించాలి.. అంతే తప్పా ఫాల్స్ ప్రెస్టేజికి పోయి కక్షపూరితంగా వ్యవహరించకూడదని కోరుతున్నాం...సత్యమేవ జయతే..!