ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానికి ఇనిస్టెంట్ ఆదాయం తెచ్చేపెట్టే మందు బాబులు..ప్రభుత్వమే ముద్దుగా పిలుచుకునే మహారాజ పోషకులంగే కనీసం గౌరవం లేకుండా పోయింది.. తాగి ఆదాయాన్ని పెంచుతారు. తాగి తూగి.. వాహనాలపై వెళుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కి మరీ ఫైన్ లు చెల్లిస్తారు.. కోర్టు కేసులు పడితే కోర్టు ఫీజులు చెల్లిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వం కేవలం మందు అమ్మి కేవల నిషా సేవ చేస్తే.. దానికి ప్రతిఫలంగా మందు బాబులు మూడు రకాలుగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వశాఖ నుంచి రాదంటే అతిశయోక్తి కాదేమో..! లాంటి మందు బాబులకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాటను, చేసిన హామీని పక్కనపెట్టేసింది ప్రభుత్వం. అవును మీరు చదువుతున్నది నిజమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో మద్యపాన నిశేషదమని చెప్పి రివర్స్ లో మద్యం రేట్లు అమాంతంగా పెంచేసి..వాటిపై వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలకు ప్రభుత్వ ఖర్చులకు జమచేసుకున్న తీరుని మందుబాబులుకూడా అదే రివర్స్ గుద్దుడుతో ఓడించారు.
కూటమి కూడా ఎన్నికలకు ముందు నెలరోజుల్లో మద్యం రేట్లు దించడంతోపాటు, నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వానికి మహారాజపోషకులైన మందు బాబులకు మాటిచ్చింది. మాటైతే ఇచ్చింది.. కానీ మద్యం రేట్లు క్రిందికి దించడంలో ఎందుకనో మీన మేషాలు లెక్కిస్తోంది. ఎందుకా అని ఆరా తీస్తే గత ప్రభుత్వంలోని డిస్టలరీల ద్వారా తయారైపోయిన మద్యాన్ని పూర్తిగా అమ్మేసిన తరువాత, కొత్త మద్యం పాలసీని తీసుకు వచ్చిన తరువాత ధరలు దించే విషయమై ఆలోచన చేద్దాంలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అధిక మద్యం రేట్లతో కాయకష్టం చేసిన ఆదాయం మొత్తం తాగుడుకే తమ భర్తలు పోసేస్తున్నారని భావించిన మహిళలు కూడా లోతుగా ఆలోచించి..ఓట్లు వేశారు కూటమికి. కనీసం వారి కష్టాలనైనా కూటమి ప్రభుత్వం అర్ధం చేసుకొని పాత బ్రాండ్లను తీసుకొచ్చి, మద్యం రేట్లు తగ్గిస్తే..కొద్ది మొత్తమైనా కుటుంబ పోషణకు వస్తుందని. ఇటు మహిళల కష్టాలు కూటమి ప్రభుత్వంలోనూ తీరకుండా పోయాయి. మాయదారి తాగుడని ప్రభుత్వం రద్దు చేయకపోగా.. కనీసం రేట్లైనా తగ్గించడం లేదని భర్తలు కష్టం మొత్తాన్ని తాగేసి ఇంటికి వస్తే అది దిగేవరకూ ఇటు భర్తను, అటు ప్రభుత్వాన్ని అమ్మనా బూతులు తిడుతున్నారు(ఆ బూతులు ఇక్కడ రాస్తే చదివేవాళ్లు కూడా చీదరించుకుంటారు.. అంతలా ఉన్నాయి అవి).
దేశంలో ఏప్రభుత్వం ఆధ్వర్యంలోనే కనిపించని బ్రాండ్లన్నీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే తెరమీదకు వచ్చాయి. ఒకప్పుడు బీరు తాగాలంటే రూ.120 ఖర్చు చేస్తే సరిపోయిది. ఇపుడు ఏకంగా షాపులో అయితే రూ. 250 బారులో అయితే రూ.350 చెల్లించాల్సి వస్తుంది. చీప్ లిక్కర్ అప్పట్లో రూ.100 పెడితే వచ్చేది ఇపుడు కనీసం రూ.200 పెడితేగానీ రావడం లేదు. అదీ నాణ్యమైన మందు కూడా కాదు. ఇక కాస్త పెద్ద బ్రాండ్ లు అయితే ఒక్కో ఫుల్ బాటిల్ పైనా రూ.1000 నుంచి రూ.1800 అదనంగా ప్రభుత్వమే అమ్ముతోంది. ఒకరకంగా మద్యంపై వచ్చినంత ఆదాయం మరే ఇతర ప్రభుత్వశాఖల్లోనూ రాకపోవడంతో గత ప్రభుత్వం కూడా దశలవారీ మద్యపాన నిషేధం అనిచెప్పి దశలవారీగా రేట్లు పెంచి మందుబాబుల జోబీలను దారుణంగా లూటి చేసేసింది. ఇపుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా ఇదే మద్యంపైనే ఆదాయం వస్తున్నది దీనితో పాత రేట్లే ఉంచాలా..లేదంటే తగ్గించాల అనే ఆలోచనలో పడిపోయిందట. రేట్లు తగ్గిస్తే ఆదాయం పడిపోతుంది. ఆదాయం పడిపోతే ఇనిస్టెంట్ గా వచ్చే ఆదాయం రాదు.. వచ్చినా తక్కువగా వస్తుందని ఆలోచన చేసి..కొత్త మద్యం పాలసీ తీసుకు వచ్చేంత వరకూ రేట్లు తగ్గించకూడదని డిసైడ్ అయిపోయిందట.
విషయం తెలుసుకున్న మందులు బాబులు.. చంద్రబాబు ఇచ్చిన హామీని పూర్తిగా పక్కనపెట్టేశారని..తలుచుకొని తలచుకొని మరీ సాధారణంగా తాగే మందుకంటే మరో క్వార్టర్ బాటిల్ ఎక్కకువగా తాగేస్తుండటంతో మందుబాబుల ప్రెస్టేషన్ ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారింది. కానీ అదే మందుబాలు కూడా తాగింది మొత్తం దిగేవరకూ కూడా కూటమిని అమ్మనా బూతులు తిట్టడం మొదలెట్టడం తరచూ ప్రభుత్వ మద్యంషాపుల వద్దే పెద్ద పంచాయతీ అయ్యింది. పోయినోడు నాసిరకంగా బ్రాండ్లతో అడ్డంగా దోచేస్తే...మద్యం రేట్లు తగ్గిస్తానని నాణ్యమైన మద్యాన్ని అమ్ముతానని చెప్పి వీడు మరీ దారుణంగా ఆ రేట్లనే కొనసాగిస్తున్నాడంటూ తిట్ల దండకం మొదలెడుతున్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచే. ఈ విషయాలేమీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడం లేదా అంటే వెళుతున్నాయి. వెళ్లినా..మరో ఐదేళ్ల వరకూ ఓటేసిన ఓటరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
అధికారంలో ఉన్నప్రభుత్వం ఏం చేసినా పైనా క్రిందా మూసుకొని కూర్చోవడం తప్పితే చేయడానికి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మద్యం రేట్లు తగ్గించినా ఆదాయం ఏమీ పడిపోదనే లాజిక్ ను గమనించాలి ఎందుకంటే రేట్లు తగ్గాయని తెలుసుకున్న మందుబాబులు సాధారణంగా కొనేదానికేం ఎక్కువ మద్యం కొంటారు. అలాగైనా ప్రభుత్వానికి నిండుగా ఆదాయం సమకూరు తుంది. గత ప్రభుత్వానికి కిక్కు దించేసిన మందుబాబులు అపుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోని కూటమి ప్రభుత్వంలోనూ కష్టాలు పడుతూ, కూటమిని కూడా తిట్ల దండకంతో కుమ్మేస్తున్నారు. చూడాలి ఇంకెప్పుడు మద్యం ధరలను ప్రభుత్వం తగ్గించి మందుబాబులకి ఇచ్చిన హామీని, అక్కచెల్లమ్మలకు చేసిన బాసను నిలబెట్టుకుంటుందనేది. అదే జరిగితే మళ్లీ పాత మందు ఈజ్ బ్యాక్.. కూల్ బీర్.. వాడ్కా ఫుల్ అనే రీతిలో ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!