ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు రేషనలైజేషన్ చేయడానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంది.. ఈ విధంగా జరగితీరక తప్పదని.. సిబ్బంది విభజన కూడా చేస్తుందని..ఈరోజు-ఈఎన్ఎస్ గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో పరిశోధ నాత్మక కథనాలను ప్రచురిచింది.. చెప్పినట్టుగానే నేడు కూటమి ప్రభుత్వం సచివాలయాలను ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా మార్పులు, చేర్పులకు ఎట్టకేలకు ముందడుగు వేసింది. పరిపాలనకు అనుగుణంగా అయితే మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది తప్పితే సచివాలయ ఉద్యోగుల సర్వీసు నిబందనలు, ప్రమోషన్ ఛానల్, నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ప్రయో జనాల పై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ జవాబుదారీ తనం పెంచేందుకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిలకు, వార్డుల్లో అడ్మి న్ సెక్రటరీలకు సచివాలయాల బాధ్యతను అప్పగించేందుకు నిర్ణయించింది. వేల సంఖ్యలో రిటైర్ అవుతున్న ఉద్యోగుల వలన పరిపాల నలో ఇబ్బందులు రాకుండా మార్పులైతే చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది తప్పితే ఉద్యోగుల ప్రధాన సమస్యలకు మాత్రం ఒక్కదా నికీ పరిష్కారం చూపలేదు..!
గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనాల ఆధారంగా కూటమి ప్రభుత్వం విభజన చేయడానికి నిర్ణయించుకుంది. మూడు విభాగాలుగా విభజించి.. దానికి తగ్గట్టుగా ఒక్కో సచివాలయాలనికి కేటరిగీ వారీగా 6 నుంచి 8 మంది సిబ్బంది ఉండే విధంగా మార్పులు చేయడానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. మిగులు సిబ్బందిని మల్టీ పర్పస్ సర్వీసుల క్రింద ఆయా మాత్రుశాఖల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను జిఏడీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) పూర్తిస్థాయిలో మార్పులు, చేర్పులు చేసి జీఓ జారీ చేస్తే తప్పా తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్దత రాదు. అయితే ఇక్కడ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిలను, వార్డుల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీలకు పరిపాలన బాధ్యతలు అప్పగించి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 1.28 లక్షల ఉద్యోగులు సర్ధుబాటు ఆయా సచివాలయాల పరిధిలోని జనాభా ప్రాతిపధిక విభజన చేస్తారు. అలా విభజన చేసే సమయంలో ప్రధాన ప్రభుత్వశాఖల సిబ్బందిని ఉంచి టెక్నికల్ సిబ్బందిని మాత్రం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఇతర విభాగాల్లోని ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో కలిపి సేవలు అందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సిబ్బంది మార్పులు చేర్పుల వలన జనాభా ఆధారంగా చాలా మంది సిబ్బందికి స్థానచలనం కలిగే అవకాశం కూడా వస్తుంది. ఇప్పటిగే గ్రామాల్లో చాలా సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిల ఖాళీలు భారీగా ఉన్నాయి. దీనితో వాటిని భర్తీచేసేందుకు మేజర్ పంచాయతీల్లో మూడు సచివాలయాల్లో ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలకు చిన్నపంచాయతీలను అప్పగించింది ప్రభుత్వం.
అయినప్పటికీ ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. వాటిని ప్రస్తుతం గ్రేడ్-4, గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిలకి ఇన్చార్జిలు ఇచ్చి పరిపాలన కొనసాగిస్తున్నది. ఇపుడు చాలా మంది సచివాలయ ఉద్యోగులకు విద్యార్హతలు సరిపోవడం, పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిన్ కార్యదర్శి పోస్టులకు అర్హతలు సరిపోవడంతో ఖాళీల్లో వారిని భర్తీచేసే అవకాశాలను కూడా ప్రభుత్వం యోచేన చేస్తున్నది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరునెలల తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా పరిపాలనా పరమైన మార్పులు అయితే తీసుకు వచ్చింది గానీ.. ఉద్యోగుల సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ విషయంలో ఒక నిర్ధిష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర నిరశా పెరిగిపోతున్నది. దానికి తోడు 74 ప్రభుత్వశాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు గత ప్రభుత్వం పెంచిన రిటైర్ మెంట్ ఎక్స్ టెన్సన్ రెండేళ్లు నిండిపోవడంతో ఉద్యోగ విరమణలు చేస్తున్నారు.
అలాంటి సమయంలో కొత్త ఉద్యోగాలు భర్తీ ప్రభుత్వానికి ఆర్ధిక భారం. అదే రేషనలైజేషన్ చేపడితే ఉద్యోగుల కుదింపుతోపాటుగా.. మిగులు సిబ్బందిని ఖాళీలు ఏర్పడ్డ ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకోవడానికి వీలుపడుతుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. అనుకున్నట్టుగానే క్యాబినెట్ లో సచివాలయాల ను ఒక అంశంగా చేర్చి రేషనలైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం. 2025 జూన్ నాటికి రాష్ట్రవ్యాస్తంగా కేవలం నాల్గవ తరగతి ఉద్యోగులే 10వేలకు పైగా రిటైర్ కాబోతున్నట్టు రాష్ట్రప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల ఎస్ఆర్ లు చెబుతున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 75వ ప్రభుత్వశాఖ గా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగులకు క్యాడర్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ కూడా సక్రమంగా ఏర్పాటు చేయకుండా ఐదేళ్లుగా ఉద్యోగులతో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల విధులకంటే అధనంగా పనులు చేయిస్తోంది.
పరిపాలన విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా అదనపు పనిగంటలు, సెలవు దినాల్లో పనిచేయిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు రాజ్యాంగ బద్ధంగా కల్పించాల్సిన ఉద్యోగ ప్రయోజనాల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఇప్పటికే మొదటి పదోన్నతి పొందాల్సిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వీసు నిబంధనలు సక్రమంగా లేకి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉండిపోయారు. ఇదే పద్దతి కొనసాగితే ఉద్యోగులు రిటైర్ అయిపోయినా వీరికి మాత్రం పదోన్నతులు మాత్రం రావు. పదోన్నతులు రావాలంంటే సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి మాతృశాఖల ఉద్యోగుల ఉన్న సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలి.
ఆ విధంగా చేస్తే ప్రభుత్వానికి ఆర్ధిక భారం పెరుగుతుందని.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ ఫైలుని పక్కనపెట్టేసింది. ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగులతో అదనపు సేవలు చేయించుకుంటుంది తప్పితే వారి ప్రయోజాలు అడిగితే మాత్రం ఆ ఒక్కట్టీ అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. కనీసం రేషనలైజేషన్ తరువాతనైనా సచివాలయ ఉద్యోగులకు జిఏడీ ద్వారానైనా పూర్తిస్థాయిలో సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, పీఆర్సీ బెనిఫిట్స్, నోషల్ ఇంక్రిమెంట్లు, ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ప్రయోజనాలు కల్పిస్తుందో లేదో వేచి చూడాలి..?!