ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో చేపట్టిన రేషనలైజేషన్ తో ఏకంగా ప్రభుత్వం 40వేల మంది ఉద్యోగులను.. 74 ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచేసిన రిటైర్ మెంట్ ఏజ్ 62ఏళ్లు పూర్తైన వారం తా వరుసగా మూడు నెలల్లో వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. ఆ ఖాళీల్లో ఉద్యోగులను కొత్తగా నియమించాలంటే ప్రభుత్వానికి కొం డంత భారం. దానితో లక్షా 30వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖను రేషనలైజేషన్ చేస్తే.. కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే పనిలే కుండా.. సిబ్బందిని అవసరం ఉన్న ఖాళీలున్న శాఖ్లల్లోకి భర్తీచేసుకోవచ్చునని భావించింది. మూడు కేటగిరీల క్రింద గ్రామ, వార్డు సచివా లయాలను విభజిస్తే.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో సుమారు 40వేల మందికి పైగా ప్రభుత్వానికి కలిసొచ్చారు.. వారందరికీ ఇపుడు రిటైర్ అయిపోతున్న ఖాళీల్లో అవసరమైన చోట డిప్యూటేషన్ పై నియమిస్తున్నారు..!
రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమంటే మీన మేషాలు, రాజ్యాంగంలోని చట్టాలను, కోర్టు కేసులను , ఆర్ధిక ఇబ్బందులను బూచిగా చూపిస్తుంది కానీ.. ప్రభుత్వానికే అవసరం అనుకుంటే అనుకున్నది చేయడానికి గంటల వ్యవధిలో జీఓలు విడుదల చేసి.. వారం రోజుల్లోనే ఉద్యోగులను అనుకున్న చోటుకి పంపించగలరు. ఇపుడు కూడా అదే చేసింది కూటమి ప్రభుత్వం రేషనలైజేషన్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందిని ఇతర ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను భర్తీచేయడానికి వినియోగిస్తున్నది. వాస్తవానికి చాలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బందికి పూర్తిస్థాయిలో పనులు లేవు. అయినా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం సర్వేలు, సమాచార సేరకరణ, ప్రభుత్వ పథకాల పంపిణీ పేరుతో వీరితో సాధారణ ప్రభుత్వ విధుల కంటే అదనంగానే పనులు చేయిస్తూ వచ్చింది.
ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖల్లో ఏ శాఖలోనూ లేనివిధంగా వీరి ఉద్యోగాల భర్తీ, శాఖల కేటాయింపూ.. పలానా శాఖ పనులనే కాకుండా అన్ని ప్రభుత్వశాఖ ల పనులూ చేయించడం మొదలు కొని.. తలా తోకా లేనివిధంగా కనీసం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయని శాఖ ఏదైనా ఉందంటే అది ఇదేనని చెప్పొచ్చు. ఇదంతా ప్రభుత్వ సౌలభ్యం కోసమే చేసుకుంటుందంటే అతిశయోక్తి కాదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీచేపట్టి ఐదేళ్లు దాటిపోతున్నా.. నేటికీ వీరి మాతృశాఖలు ఏంటి..? సదరు మాతృశాఖలోని సర్వీసు నిబంధనలు వీరికి కూడా వర్తిస్తారా అంటే ఆ ఒక్కటీ అడక్కు అనే అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగని కొత్తగా ఏర్పాటు చేస్తారా అంటే.. రాజ్యాంగంలోని ఏ నిబంధనల క్రింద మీకు సర్వీసు నిబంధనలు ఇవ్వాలని తిరిగి ప్రశ్నిస్తున్నది.
చచ్చీ చెడీ రాజ్యాంగంలోని కొన్ని నిబంధన ప్రకారం మాకూ మా మాతృశాఖల్లోని నిబంధనలే వర్తింపచేయొచ్చనే వెసులు వాటు ఉందీ అంటే... ఇప్పుడప్పుడే కాదు తరువాత చూద్దాం అంటోంది. అంటే ఉద్యోగులకు చట్టబద్ధంగా, న్యాయ బద్ధంగా ఇవ్వాల్సిన ప్రయోజనాల విషయంలో మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ వచ్చిన ప్రభుత్వం.. ఇపుడు అత్యవసరంగా కొత్తగా ఉద్యోగాల భర్తీ చేయాల్సి వస్తుందని మాత్రం రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులను కుదించేసింది. అదేమంటే ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేస్తుంది.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏ నిర్ణయమైనా తీసుకును అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రత్యేక జీఓలు వెలువరించి మరీ చెబుతున్నది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 35వేల మంది ఉన్న ఉద్యోగులు గత ప్రభుత్వంతో పాటు, ఇపుడు కూటమి ప్రభుత్వంలోనూ హెచ్చరికలు, బెదిరింపులు, టార్గెట్ లకు గురవుతూనే ఉన్నారు. ఐదేళ్ల నుంచి ఈశాఖ ఉద్యోగులకు విధినిర్వహణలో సమయపాలన లేదంటే అతిశయోక్తి కాదు.
కనీసం రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవులు అనేవి కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో పనులు చేయించుకుంటూ వస్తున్నది. అయితే ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగమనే ఒకే ఒక్క కారణంతో విధులు చేస్తున్న ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసింది. దీనితో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కాదని.. అనవసరంగా కూటమి ప్రభుత్వానికి చేయూతనిచ్చామని.. కనీసం గత ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పటికైనా తమకు పదోన్నతులు, సర్వీసు నిబంధనలు వచ్చి ఉండేవని సామాజకి మాద్యమాల్లో పెద్ద చర్చలకు తెరలేపుతున్న ఉద్యోగులు. ఎవరు ఎన్ని చేసినా వచ్చే నాలుగున్నరేళ్లు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆధారంగా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేయక తప్పదు.
గత ప్రభుత్వమే కాదు.. ఈ ప్రభుత్వంలోనూ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావనే విషయం జీఓనెంబరు 1 విడుదల (రేషనలైజేషన్) తో తేలిపోయింది. ఇక్కడ ఉద్యోగులను తీసుకెళ్లి ఇతరశాఖల్లో ఇన్చార్జిలుగా నియమిస్తే.. ఆ శాఖలో పనిచేయడానికి తప్పా.. ప్రభుత్వ ప్రయోజనాలు ఏ మాత్రం రావనే విషయం, ప్రభుత్వం అమలు చేయదనే విషయం సచివాలయ ఉద్యోగులకు తెలిసినట్టు లేదంటున్నారు విశ్లేషకులు. చూడాలి అవసరం కోసం రేషనలైజేషన్ చేసిన ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నెరవేస్తుందా..? గత ప్రభుత్వం మాదిరిగా గాలికొదిలేస్తుందా..? అనేది..?!