అంతా నాయిష్టం.. కమిషనర్ అయితే ఏంటి..? ఈరోజు-ఈఎన్ఎస్ పై అవ్వాకులు చవ్వాకులు పేలితే కబడ్దార్..!


Ens Balu
216
visakhapatnam
2025-03-12 18:43:33

విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ అందిస్తున్న వరుస కథనాలు కూటమి ప్రభుత్వంలో చలనం తీసుకు వస్తున్నాయి.. కావాలని చేసిన తప్పులు.. నోటి దురుసు, నిమ్నజాతీయులను కులం పేరుతో దుర్భాష లాడటం, దూషించడం.. స్పష్టంగా కనిపిస్తున్నా ఆధారాలతో కూడిన కథనాలు  ఈరోజు-ఈఎన్ఎస్ లో వస్తుంటే లోన తడిచిపోతున్నా.. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.. అదేదో చిన్న మీడియా సంస్థ.. అందులో వార్తలు వస్తే ఏమైపోతుంది..?  చేసిన తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నా..  ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఆయుష్ కమిషనర్ అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఎవరేం చేయగలరు..? అంటూనే ఈరోజు-ఈఎన్ఎస్ పై కడుపులో ఉన్న కుళ్లునంతా కక్కుతున్నారు సదరు స్టడీ సర్కిల్ నిర్వాహకుడు.. నిజమే ఈరోజు-ఈఎన్ఎస్ వార్తలు మిమ్మల్ని ఏమీ చేయలేపోవచ్చు.. మీరు అందరినీ మీ స్టైల్ లో మేనేజ్ చేయవచ్చు.. 

ఇక్కడ ఈరోజు-ఈఎన్ఎస్ ని ప్రభావితం చేయలేక పోయారు కదా..? మీకు భయం లేకపోతే మీ శాఖ మంత్రి వద్ద ప్రస్తావన ఎందుకు తెస్తారు.. పదే పదే ఈ విషయంలో కమిషనరేట్ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..?  అదేదో చిన్న సంస్థ, అయితే ఏంటి అని లోలోన భయ పడుతూ.. పైకి ధైర్యం నటించడం దేనికి..?  అంటే.. ఈరోజు-ఈఎన్ఎస్ కథనాల్లో కంటెంట్ ఉంది..? ఆధారాలున్నాయి.. చేసిన తప్పులపై ఫిర్యాదులున్నాయి.. అంతేకాదు పక్కాగా విశాఖ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసే నమోదైందంటే ఇంకా మీరు చేసిన తప్పులేం టో మీకు అర్ధం కావడం లేదా..? ఈ విషయంలో ఎవరూ ఈరోజు-ఈఎన్ఎస్ ని ప్రభావితం చేయలేరు.. కూటమి ప్రభుత్వానికి ఆయుష్ ద్వారా కావాలని చేసే తప్పులతో మచ్చతేవాలని చూస్తే.. ఊరుకునేది లేదు..!

ఎస్.. ఈరోజు-ఈఎన్ఎస్ అంటే మీడియా సంస్థ మాత్రమే కాదు..  ఒక న్యూస్ బ్రాండ్.. ఒక రియల్ న్యూస్ ఫ్యాక్టరీ.. ఒక ట్రెండ్ సెట్టర్..  ఈ మీడియా సంస్థ నుంచి వచ్చే వార్తలకు ఒక లెక్కంటుంది.. ఆధారాలతో రుజువు చేసే కంటెంట్ వుంటుంది.. ఈ విషయంలో ఎవరూ ఈరోజు-ఈఎన్ఎస్ ని ప్రభావితం చేయలేదు.. న్యాయం ఎవరివైపు వుంటే వాళ్ల వైపే ఈరోజు-ఈఎన్ఎస్ కలం కదులుతుంది.. వారి ఆవేదనకు, అవమానాలకు కథనాలు తోడవుతాయి.. న్యాయం కోసం ఎంత వరకైనా వెళుతుంది.. ఎవరో కాసుల ఆశ చూపారాని.. మరెవరో కులం పేరుతో ప్రలోభాలకి దిగారని.. జడిసే రకం కానేదు.. ఇక విషయానికి వద్దాం.. వైద్య ఆరోగ్యశాఖలో భాగంగా ఉన్న ఆయుష్ విషయంలో జరుగుతున్న వ్యవహారాలను గత కొద్ది రోజులుగా ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలతో బయట పెడుతున్నది. అయితే ఆ కథనాలకు ఉలిక్కిపడుతున్న విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి, వారి కుటుంబ సభ్యులుగా చెప్పుకునే వారు ఆయుష్ కమినరేట్ లో ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలపై మల్ల గుల్లాలు పడుతున్నారు. 

ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతున్నాం కానీ.. విశాఖ నుంచి వచ్చే ఆ స్మాల్ అండ్ మీడియం మీడియా సంస్థను మేనేజ్ చేయలేకపోతున్నామని అంటూనే.. ఆ పేపర్ లోనూ, ఆ సంస్థలోనూ వార్తలు వస్తే ఏమైపోతుంది.. అంటూ బీరాలు పోతున్నారు.. ఏదో అయిపోతుందని ఈరోజు-ఈఎన్ఎస్ వాస్తవాల ఆధారంగా కథనాలు రాయడం లేదు సుమీ.. జరిగిన విషయాలు, జరుగుతున్న అధికారిక ప్రలోభాలను,  దళిత వైద్యులకు జరిగిన అవమానాలను, మాల నాకొడకా.. మాదిగ నాకొడకా అని తిట్టిన విధానంపై ఆయుష్ కమిషనర్ కి వెళ్లిన ఫిర్యాదు పైనా..  దళిత మహిళా ఉద్యోగినిపై చేయి చేసుకుని తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేసిన వైనంపైనా ఈరోజు-ఈఎన్ఎస్ లో కథనాలు ప్రచురితం అవుతున్నాయి. అవి అవాస్తవాలు కాకపోతే మీరూ  ఖండన ఇచ్చుకోవచ్చు.. దానిని ప్రచురిస్తాం వాస్తవాలుంటే.. అంతే తప్పా వరుస కథనాలు రాస్తున్నారని ఈరోజు-ఈఎన్ఎస్ పై అవ్వాకులు, చెవ్వాకులు పేలితో మాత్రం అదీ వార్తాకథనంగా రాస్తాం.. ఇదిలో ఇలా అన్నమాట.

ఆయుష్ కమిషనర్ డి.మంజుల, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబులకు విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చేస్తున్న పనులు, తప్పులు కనిపిస్తున్నాయో లేదో తెలియడం లేదు.. దళిత వైద్యులను మాల నాకొడకా.. మాదిగ నా కొడకా అని సంబంధించి వేధిస్తున్న ఫిర్యాదులు చూశారో లేదో తెలీదు.. విశాఖలోని ఆయుష్ ఆర్డీడి కార్యాలయంలో దళిత మహిళా ఉద్యోగిని సుష్మాపై చేయి చేసుకొని, తిరిగి ఫిర్యాదు చేసిన విషయం అసలు గుర్తించారోలేదో కూడా తెలీదు.. అంతెందుకు ఒక రిటైర్ అయిన డాక్టర్ ఫేర్ వెల్ పార్టీ కోసం విశాఖలోజిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ అతిథి గృహంలోనే డిస్పెన్సరీలన్నీ మూసేసి సన్మానాలు చేయించుకున్న విషయం మీడియాలో వచ్చిన ఫోటో ఆధారిత కథనాలు.. డిస్పెన్సిరీలను డోర్ లాక్  విషయం కూడా కావాలనే మరిచిపోయారా..? 

దళిత ఉద్యోగినిపై చేయి చేసుకున్నవిషయంలోనూ, కులం పేరుతో దూషించిన విషయంలోనూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన విషయం నేటికీ తెలియదా..?  సర్వీసు రూల్స్, క్రమశిక్షణ చర్యలు అసలు ఆయుష్ లో ఉండవా..?  దళిత వైద్యులు, ఉద్యోగులు జాతీయ మహిళా సంఘానికి తమను కులం పేరుతో దూషించారని, పరిపాలన పేరుతో వేధించిన విషయమూ మీకు తెలీదా..? నిబంధనలను అతిక్రమించి రోస్టర్ పోయింట్లను మట్టిలో కప్పెట్టేసి.. అడ్డదారిలో ఇన్చార్జి  ఆర్డీడి పోస్టు కట్టబెట్టిన విషయమూ గుర్తులేదా..? జరిగిన అవినీతిపై లోకా యుక్తాకి ఫిర్యాదులు వెళ్లిన విషయమూ ఇంకా తెలీదా..? ఇదే ఇన్చార్జి ఆర్డీడి విషయంలో డా.లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుడిపై బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ కు  ఫిర్యాదులు చేసిన విషయంలో జరిగిన రాద్దాం మర్చిపోయారా..? ఇదే ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుడు బాధితులపైనే తిరిగి ఆరోపణలు చేస్తూ.. కమిషనరేట్ లోనూ, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోనూ తన పలుకుబడిని వినియోగిస్తున్నా అసలే గుర్తులేదా అంటున్నారు..

 ఆయుష్ లోని దళిత వైద్యులు, వేధింపబడ్డ  వెనుకబడిన వర్గాల వైద్యులు, డిస్పెన్సరీల సిబ్బంది.. అదే విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ లో వరుస కథనాలు వస్తే.. ఏం పీకుతారులే అన్నవారు..? వైద్యఆరోగ్యశాఖ మంత్రి పెషీలో రచ్చచేయడం దేనికి... అడ్డదారిలో ఇన్చార్జి పోస్టుకొట్టేసిన విషయాన్ని ఇదే కమిషనరేట్ లోని ఒక ఉన్నతాధికారి పెషీలోని అధికారులకు జీవోలు, అడ్డదారి వ్యవహారాలను వివరిస్తే ఎందుకు వెనక్కి తగ్గారు..? అంటే మీరు చేసేవన్నీ చేసేయొచ్చు.. మీవాళ్లని కాపాడేసుకోడానికి ఏమైనా చేయొచ్చు.. అదే ఈరోజు-ఈఎన్ఎస్ లో జరిగిన అంశాలపై వాస్తవాలతో కూడిన కథనాలవు వస్తే నొప్పులొచ్చేస్తున్నాయా  అంటూ ప్రశ్నిస్తున్నారు దళిత వైద్యులు, బాధితులు..?

అంతెందుకు.. విశాఖలోని ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ ఇదే కార్యాలయంలోని దళిత మహిళా ఉద్యోగినిపై చేయి చేసుకొని, కులం పేరుతో దూషించిన విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైతే... ఇటు ఇన్చార్జి  ఆర్డీడిని, అటు జూనియర్ అసిస్టెంట్ ను సుదీర్ఘ సెలవుపై వెళ్లిపోమని కమిషనరేట్ నుంచి మౌకిక ఆదేశాలిస్తే ఎవరు పాటించారు..? ఇదే ఇన్చార్జి ఆర్డీడి తనకు లిఖిత పూర్వకంగా ఆర్డర్ వస్తే తప్పా తాను సెలవు పెట్టనని.. ఎఫ్ఎఆర్ఎస్ అటెండెన్సు ఇంటి దగ్గరే ఉండి  విధులు నిర్వహిస్తుంటే ఆయుష్ లోని కమిషనర్ గానీ, వైద్యఆరోగ్యశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీగానీ, బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తూ అందులో పేర్కొన్న డా.లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులకు గానీ ఆమె చేస్తున్న తప్పులు కనిపించడం లేదా..?

 పైగా తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని అధికారులను, ప్రజాప్రతినిధులను ఏ మొహం పెట్టుకొని మేనేజ్ చేస్తే.. అధికారులు మరెలా నమ్ముతారంటూ దళిత సంఘాలు సైతం మండి పడుతున్నాయి.. ఆ విషయాలే కథనాలు ఈరోజు-ఈఎన్ఎస్ రాసింది.. ప్రత్యేక కథనాలుగా అందించింది.. అంటే మీరు తప్పులు మీద తప్పులు కావాలని చేసేయొచ్చు కానీ.. దానిపై ఏ మీడియాలోనూ వార్తలు రాయకూడదు..? ఎవరూ ప్రశ్నించకూడదు..? అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడి అయిపోయినా అడక్కూడదు..? తప్పులను ప్రశ్నించకూడదంటే ఎలా అంటున్నదళిత సంఘాలను కూడా బెదిరాస్తారా..? ఇలాంటివి ఈరోజు-ఈఎన్ఎస్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది..? అందుకనే వార్తలు రాసింది. మీకు వాస్తవాలపై వచ్చిన వార్తలంటే పట్టింపు లేకపోవచ్చు.. కానీ పేపర్ అంటే పేపర్.. అందులో చిన్నా, పెద్దా ఉండవు.. ఆధారాలు ఆధారాలే అనే విషయం అధికారులకు కూడా తెలుసు కనుకనే కమిషనర్ డి.మంజుల సైతం ఈరోజు-ఈఎన్ఎస్ కి జరుగుతున్న వ్యవహారాలు, తాము రాసే కథనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరణలు కూడా ఇస్తున్నారు.

 ఆయుష్ కమిషనరేట్,  మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం, ఆరోగ్యశాఖ మంత్రి పెషీలో ప్రైవేటు వ్యక్తుల ప్రలోభాలకు కూటమి ప్రభుత్వంలో ఎవరూ తలొంచరు కాబట్టే.. వాస్తవాలపై ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలు ప్రచురించ గలుగుతుంది. అలా కాకకుండా మొత్తం తేడా బ్యాచ్ అని తెలిస్తే వదిలి పెట్టేసేది.. ఒక్క కథనం కూడా రాసేది కాదు.  అధికారుల్లోని నిజాయితీ ఉంది కనుకనే ఈరోజు-ఈఎన్ఎస్ రాసే కథనాలకు వివరణలు ఇస్తున్నారు.. ఆ కథనాల క్లిప్పింగులనే ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు..  విశాఖలోని ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి విషయంలో కావాలని చేసిన తప్పులపై వచ్చిన ఫిర్యాదులు సంఖ్య, ఇప్పటి వరకూ ఇచ్చిన చార్జి మెమోల విషయాన్ని మీడియా ద్వారా బయటకు తెలియజేస్తున్నారు. వైద్యులంటే దేవుడితో సమానం.. అందులో దళిత వైద్యులంటే  ఇంకా చేతులెత్తి మొక్కి మరీ వారికి గౌరవం ఇవ్వాలి.. సమాజంలో వారికంటూ ఓ గుర్తింపు ఉంది.. 

సమస్త ప్రజానికానికీ వైద్యసేవలు అందించే దళిత వైద్యులను మాల నా కొడకా.. మాదిగ నా కొడకా అని తిట్టి, అవమానించిన లిఖిత పూర్వక ఫిర్యాదుపై చర్యలు లేకపోతే కూటమి ప్రభుత్వంలోని అధికారులు ప్రలోభాలకు గురిచేసే వారి గుప్పెట్టో పడ్డట్టేనని అంతా అనుకుకునే అవకాశం ఉంది కదా..? ఆ విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలుగా రాస్తే బెదిరింపులా..? అవాకులు, చెవాకులూ మాట్లాడతారా..? మీరు మాట్లాడండి మీకు వాక్ స్వాతంత్ర్యపు హక్కు వుంది.. మీడియాగా మాకు రాజ్యాంగం ఆర్టికల్ 19, ఆర్టికల్ 10 ప్రకారం పత్రికా స్వేచ్ఛ హక్కు ఇచ్చిందీ మేమూ రాస్తాం.. రాసే కలాన్ని బెదిరింపులతోనూ, అదిరింపులతోనూ ఎవరూ ఆపలేరు.. అవ్వాకులు, చెవ్వాలకు పేలి అసలే నియంత్రించలేరు.. ఈ విషయంలో ఎంతటి వారికైనా ఆధారాలతో కూడి వార్తలతోనే సమాధానం చెబుతాం తప్పా ఎవరి బెదిరింపులకు అదిరేది లేదని.. కాసులకు కక్కుర్తి పడేది లేదని తెలియజేస్తున్నాం. వాస్తవ కధనాలకు మేము కంకణ బద్దులం..  

కబడ్దార్.. నోరు అదుపులో పెట్టుకోక పోతే మర్యాద దక్కదని మరోసారి హెచ్చరిస్తున్నాం..ఇదే సమయంలో జరుగుతున్న తంతులో ప్రతీ విషయంలోనూ వివరణ ఇస్తూ.. ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ఈరోజు-ఈఎన్ఎస్ కి చెప్పే ఆయుష్ కమిషనర్ ముంజుల, ఆయుష్ కమిషనరేట్ అధికారులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాం.. దళితులకు, అందునా దళిత మహిళకు అన్యాయం జరిగినపుడు సహాయం పడకపోయా.. వాస్తవాలను రాజ్యాంగం కల్పించిన భావప్రకటన హక్కు ద్వారా మీడియాలో కథనాలు ప్రచురించకపోయినా.. రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్.అంబేద్కర్ ను అవమానించినట్టే లెక్క.. చూడాలి.. తప్పులు చేస్తూ.. అధికారులను, వారి ఆదేశాలను దిక్కరిస్తూ.. దళిత వైద్యులను కులంపేరుతో దూషించి, అధికారుల ఆదేశాలను దిక్కరించిన విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఆయుష్ కమిషనరేట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది..?!

సిఫార్సు