ఇక విశాఖ మెయిర్ పీఠం వైఎస్సార్సీపీదే..


Ens Balu
3
Visakhapatnam
2020-10-06 13:14:03

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు స్థానిక, పురపాలక సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మహావిశాఖ నగరపాలక సంస్థతోపాటు మిగిలిని రెండు రాజధానుల్లో మేయర్ పీఠాలు అధికారపార్టీ వైఎస్సార్సీపీవేనని తేలిపోయింది.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతశ్రమించినా ఒక్క విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కసీటు గెలవలేకపోయినా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల నుంచి విశేషంగా పెరుగుతున్న ఆదరణ చూసి టిడిపి ఎమ్మెల్యేలు సైతం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. విశాఖలో బలమైన నియోజకవర్గాలుగా ఉన్న విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు, ఆతరువాత విశాఖ పశ్చిమం. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల బలాబలాలను బట్టీ విశాఖ మేయర్ పీఠం ఆధారపడి వుంటుంది. ఇందులో అధికారికంగా ఒక ఎమ్మెల్యే వచ్చేసిన తరువాత మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో టచ్ లో ఉన్నారు. అంటే వీరి తరపున కుటుంబ సభ్యులు పార్టీలో చేరినా, ఎమ్మెల్యేలుగా వుంటూ వీరు ప్రభుత్వానికి సపోర్టు చేస్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని కాబోతున్న జీవిఎంసీలో వైఎస్సార్సీపీ జెండా ఎగురడం దాదాపు ఖాయమైపోయింది. ఇకపోతే మిగిలిన రెండు ప్రాంతాల రాజధానుల్లోకూడా వైఎస్సార్సీపీ జెండా ఎలాగూ ఎగురుతుందనే ధీమా పార్టీలో వచ్చేసింది. అంటే ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసే ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో అధికాపార్టీవే పీఠాలని చెప్పక తప్పదు. ప్రతిపక్షంగా వున్న టిడిపి క్రమేపీ తన ప్రతిపక్ష హోదా కూడా కోల్పేయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలంతా అధికార పార్టీకి మద్దతు ఇవ్వడంతో మున్సిపాలిటీ ఎన్నికలు నల్లేరు మీద నడకనే చెప్పాలి. అయితే కొంత మంది ఇంకా టిడిపిని వీడలేదు. అలాంటి వారి దగ్గర నుంచి మున్సిపల్ ఎన్నిల్లో కాస్త తేడాలు వస్తాయా అనే అనుమానంపై కసరత్తు చేస్తున్న అధిష్టానం ఇటీవలే పలు కార్పోరేషన్లకు చైర్మన్ పదువులు ఇచ్చి మరీ వారికి న్యాయం చేసింది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 90శాతం నామినేటెడ్ పోస్టులు భర్తీచేయకపోవడం, అన్ని సామాజిక వర్గాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం, వారికి సంక్షేమ పథకాలు కల్పించడం వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇన్నిరకాలుగా పాజిటివ్ వేవ్స్ వస్తున్న తరుణంలో ఇక పురపాలక గెలుపు ధీమా ఉండటం సహజమేకదా..!