వైద్యం తరువాత అసరాాగా రూ.5వేలు..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 6
                            
                         
                        
                            
Visakhapatnam
                            2020-10-18 15:04:05
                        
                     
                    
                 
                
                    రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం అండగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'గత పది నెలల్లో 134 కోట్ల వ్యయంతో 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయలో అండ. డిశ్చార్జైన 48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు. కుటుంబ పెద్ద కోలుకునే సమయంలో పెద్దదిక్కుగా మారిందీ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  ముందు చూపునకు మచ్చుతునక' అంటూ ప్రశంసలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు పూర్తిస్థాయిలో కార్పోరేట్ వైద్యం అందించింన ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రకెక్కిందన్నారు. ఆపదలో కూడా 108 అంబులెన్సులు అదేస్థాయిలో ఆపద్బాందవుడిగా పనిచేస్తున్నాయన్నారు. 104 ద్వారా ప్రతీ గ్రామంలో ఉచిత వైద్యసేవలు, పరీక్షలు చేపడుతున్నారని పేర్కొన్నారు.