ప్రవేశపరీక్ష ద్వార త్రిపుల్ ఐటీ ప్రవేశాలు..


Ens Balu
4
విజయవాడ
2020-10-22 15:32:06

2020-21 సంవత్సరానికి గాను 6 సంవత్సరాల బి.టెక్ కోర్స్ ప్రవేశనిమిత్తం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజయవాడ ఆర్అండ్‌బి కార్యాలయములో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గురువారం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటి) నోటిఫికేషన్‌ను మంత్రి విడుదల చేసారు. ఈసందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజీవ్‌గాంధి యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్ జియుకెటి) ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా, వారి ప్రతిభాస్ధాయిని అనుసరించి బి.టెక్ కోర్సులలో ప్రవేశాలు ఉంటాయని మంత్రి అన్నారు. ఎ ంపికైన అభ్యర్ధులు ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయిలో గల త్రిబుల్ ఐటిల్లో సమీకృత విద్యతోకూడిన బి.టెక్ చదువుకునే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. ఈకోర్సుతోపాటు రెండు సంవత్సరాలు, మూడుసంవత్సరాల డిప్లమో కోర్సులలోకూడా కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణులై ప్రతిభాస్ధాయి ఆధారంగా యన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు, వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం తిరుపతి, డా. వైయస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వెంకట్రామన్నగూడెంలలో చదువుకునే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. 100 మార్కులు ఆధారంగా నిర్వహించే కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించి 10వ తరగతి సిలబస్‌లోనే పరీక్ష ఉంటుందని, రెండుగంటలపాటు నిర్వహించే ఈపరీక్ష 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయని, నెగిటివ్ మార్కులు లేవని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యస్‌యస్‌సి (10వ తరగతి) స్ధాయిలో ఉన్న గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలు ఈప్రవేశపరీక్షకు సిలబస్ అని, మల్టీబుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ఓయంఆర్ బేస్డ్ ఆన్సర్ షీట్ ఉంటుందని మంత్రి అన్నారు. మోడల్ క్వశ్చన్ పేపర్ ను అభ్యర్ధుల సౌకర్యార్ధం యూనివర్సిటీ వెబ్ సైట్ ూూూ.సగషీష.n లో అందుబాటులో ఉంచామని మంత్రి అన్నారు. పరీక్ష ఓయంఆర్ షీట్ పద్ధతిలో నిర్వహిస్తారని మంత్రి అన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఎ గ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార ఈప్రవేశ పరీక్షల నిర్వాహణ బాధ్యతను అప్పజెప్పడమైనదని మంత్రి అన్నారు. ఈకామన్ ఎ ంట్రన్స్ టెస్టుకు సంబంధించి ఓసి అభ్యర్ధులు రూ. 300 లు, బిసి అభ్యర్ధులు రూ. 200 లు, యస్‌సి, యస్‌టి అభ్యర్ధులు రూ. 100 లు కామన్ ఎ ంట్రన్స్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుందని మంత్రి సురేష్ అన్నారు. పరీక్షాకేంద్రాల వద్ద కోవిడ్-19 నియమనిబంధనలు పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి అన్నారు. పరీక్ష వ్రాసే అభ్యర్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పరీక్షకు హాజరుకావాలని అన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్ చేస్తామని, సిబ్బంది కోవిడ్ నియమనిబంధనలు పాటించేలాగా చర్యలు తీసుకున్నామని మంత్రి అన్నారు. పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, అంబులెన్స్ వివరాలను ప్రతీ పరీక్షా కేంద్రంలో సమాచారం అందుబాటులో ఉంచామని మంత్రి అన్నారు. కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్ కు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసామని, ఈనెల అక్టోబరు 28 నుండి నవంబరు 10 వరకు అభ్యర్ధులు ఫీజులు చెల్లించి ధరఖాస్తులు పంపవచ్చునని మంత్రి అన్నారు. ఆన్‌లైన్ లో www.rgukt.in లో ధరఖాస్తులు సమర్పించడానికి నవంబరు 10వ తేదీ ఆఖరు తేది అని మంత్రి అన్నారు. రూ. 1000 లు అపరాధరుసుంతో ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరితేది నవంబరు 15 అని మంత్రి అన్నారు. అభ్యర్ధులు నవంబరు 22న హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని, నవంబరు 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని మంత్రి అన్నారు. ప్రాధమికపరీక్షల సమాధానాలు (కీషీట్) అదేరోజు విడుదల చేస్తామని, ప్రాధమికపరీక్షల సమాధానాలమీద అభ్యంతరాలను 30.11.2020న ప్రచురిస్తామని, ఫైనల్ కీ డిశంబరు 1న ప్రచురిస్తామని మంత్రి అన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధుల సహాయం కొరకు సహాయకేంద్రాలు (హెల్ప్‌లైన్) పనిజేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 6 సంవత్సరాల సమీకృత బి.టెక్ కోర్సుకు సంబంధించి 4 వేల సీట్లు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల డిప్లమో కోర్సులకు సంబంధించి 6 వేల సీట్లు ఉన్నాయని, కామన్ ఎ ంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణులు అయి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని మంత్రి అన్నారు. 100 మంది కంటే అభ్యర్ధులు ఎ క్కువుగా ఉంటే ఆమండలంలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, 100 మంది అభ్యర్ధులుకంటే తక్కువుగా ఉంటే దగ్గరలోని పరీక్షా కేంద్రానికి అభ్యర్ధులను కేటాయిస్తామని మంత్రి అన్నారు. నాన్ లోకల్ అభ్యర్ధులకు ప్రవేశాల్లో15 శాతం కేటాయించామని ఇందుకు సంబంధించి తెలంగాణా రాష్ట్రంలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసామని, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ ,ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ , మెదక్, నల్గొండలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసామని మంత్రి సురేష్ అన్నారు.