జర్నలిస్టులకు రూ.50లక్షల భీమా కల్పించాలి..గంట్ల
Ens Balu
1
2020-07-20 20:51:12
కరోనా సమయంలో జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నా రు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల హెల్త్ కార్డులు రెవిన్యువల్ చేయడంతోపాటు శక్తికి మించి కష్టపడుతు న్న జర్నలిస్టులకు రూ.50 లక్షల భీమా కల్పించాలన్నారు. తద్వారా కరోనా సమయం లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడానికి అవకాశం వుంటుందన్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మి కుల కంటే జర్నలిస్టులు అత్యధిక సేవలు ప్రజలకు చేస్తున్నా వారికి కరోనా సమయంలో గుర్తింపు రాలేదన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలి స్టు లు పనిచేయకపోతే భాహ్య ప్రపంచంలోని సమస్యలు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లేవా అని ప్రశ్నించారు.