గీతం, టిడిపి కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తున్నాయి..


Ens Balu
4
Visakhapatnam
2020-10-26 15:33:41

గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ భూముల విషయంలో కోర్టు ఉత్తర్వును టీడీపీ వక్రీకరించి ప్రచారం చేస్తోందని అనకాపల్లి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి గుడివాడ అమరనాథ్‌ చెప్పారు. ఈ మేరకు విశాఖలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు భరత్‌కు చెందిన గీతం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేయాలని చూస్తుందన్నారు. 70 రోజులు జైళ్లో ఉన్న అచ్చెన్నాయుడు కూడా గీతం భూములపై మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు. విశాఖలో ఆక్రమిత భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారని, ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. గీతం ఆధీనంలోని 40 ఎకరాల ఆక్రమిత భూమి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతించడాన్ని టిడిపి జీర్ణించుకోలేకపోతుందన్నారు.  అటు గీతం యాజమాన్యం కూడా కోర్టు ఆర్డర్‌ను కూడా వక్రీ కరించి ప్రచారం చేస్తోందన్న ఎమ్మెల్యే.. రిట్ పిటిషన్ గీతం ఆధీనంలో ఉన్న శాశ్వత నిర్మాణాలు మాత్రమే తొలగించవద్దు అని మాత్రమే కోర్టు సూచించన విషయాన్ని కోర్టు ఆర్డర్ చూసిన వారెవరికైనా తెలుస్తుందన్నారు. కానీ టీడీపీ కి చెందిన పచ్చమీడియా కోర్టు ఆర్డర్లను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఆగస్టు 3న  గీతం యాజమాన్యం తమ ఆధీనంలోని 43 ఎకరాల ఆక్రమిత భూమిని క్రమబద్ధీకరించాలని కోరిందని అయితే ఇప్పటికే సర్కారు నుంచి 71 ఎకరాలు తీసుకుని ఇంకా భూమి కావాలని కోరడంతో దానిని ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. గీతం యాజమాన్యం తన సొంత భూమి రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఖాళీగా ఉంచుకుని ప్రభుత్వ భూమి విద్యాసంస్థలకు ఆక్రమిస్తామంటే ఎలా ప్రభుత్వం అంగీకరిస్తుందని ప్రశ్నించారు.  పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తుంది కానీ ఇలా భూ దాహం వున్న వ్యక్తులకు ప్రభుత్వం ఇవ్వదని స్పష్టం చేశారు.  చంద్రబాబు  ప్రభుత్వం కూడా ఆఖరి క్యాబినెట్‌లో గీతం భూముల క్రమబద్దీకరణ అంశాన్ని అప్పటి  క్యాబినెట్ వాయిదా వేసిందంటే పరిస్తితి ఎలా వుందో అదే పచ్చమీడియా అర్ధంచేసుకుంటే మంచిదన్నారు. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుందని, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని విమర్శలు చేసే టీడీపీ నాయకులు రుజువు చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ అవినీతి విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తోందని దానికి... చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు' అంటూ ఎమ్మెల్యే అమరనాథ్‌ చంద్రబాబు కుటిల రాజకీయాన్ని ఎండగట్టారు..