పబ్జీ బ్యాన్..కానీ వారంతా ఇంకా ఆడుతూనే ఉన్నారు..


Ens Balu
3
Visakhapatnam
2020-10-30 10:55:51

భారత దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది. ఇది ఒక రకంగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామసచివాలయ వాలం టీర్లకు చేదు వార్తే..  పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేయనుందని ఈ మేరకు పబ్‌జీ ఫేస్‌బుక్ పేజీలోఅధికారిక ప్రకటన చేసింది. నేటి (అక్టోబర్ 30,2020) నుంచి వినియోగదారులందరికీ పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించారు. అయితే తమ తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్‌జీని ఆడుకోవచ్చు. అత్యధికంగా గ్రామవాలంటీర్లు ఈ గీమ్ ని ఎక్కువగా తమ మొబైల్స్ ఆడుతున్నారు. అదీ ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్స్ నే ఆడుతుండటం విశేషం. ఆ విషయం ఆయా గ్రామసచివాలయ అధికారులు ద్రుష్టి కేంద్రీకరిస్తే వాస్తవాలు తెలిసే అవకాశం వుంది. అయితే తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ అవకాశం కూడా అందరు యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. కాగా కరోనా వైరస్  విస్తరణ, సరిహద్దు వద్ద చైనా దుశ్చర్య నేపథ్యంలో గోప్యత,  భద్రత కారణాల రీత్యా భారత ప్రభుత్వం పబ్‌జీ సహా118 చైనా యాప్స్‌ని నిషేధించి నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, దీనిని విపరీతంగా వినియోగించడం విశేషం..