ఏపీ మహిళా మంత్రులు దాత్రుత్వం..


Ens Balu
3
తాడేపల్లి
2020-11-05 20:29:35

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులంటే ఎంతో హడావిడీ..వెనుక ఐదారు కార్లు..గన్ మేన్లు వగైరా...నిమిషం కూడా ఖాళీ ఉండదు..కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రులు అలా కాదు..వాళ్లకి ప్రజల కష్టాలు తెలుసు, బాధలను కళ్లారా తక్షణమే స్పందిస్తారు కూడా.. అదిఎలాంటి సందర్భమైనా ఒక్కటే వారికి.. తమవంతుగా సహాయం చేస్తూ నిత్యం ప్రజల మనిషిగా ఉంటారు...ఆ విధంగానే గురువారం ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులు తమ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు...మంత్రులమైనా తోటివారికి సహాయం చేయడంలో ముందుంటామని నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి రాష్ట్ర మహిళా మంత్రులు తమ సేవాగుణాన్ని ప్రదర్శించారు..వివరాలు తెలుసుకుంటే.. దొండపాడుకు చెందిన నరసింహారావు గురువారం కరకట్ట రోడ్డుపై వెళుతున్న సమయంలో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహారావుకు తీవ్ర గాయాలై రోడ్డుపక్కనే పడివున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి సుచరిత​ కరకట్టపై గాయాలతో పడిఉన్న నరసింహారావును చూశారు. వెంటనే వాహనాన్ని ఆపి మరో మంత్రి తానేటి వనితతో కలిసి నరసింహారావును తమ కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తక్షణ సహాయం అందించాల్సింది మంత్రులు వైద్యులనుఆదేశించారు. ప్రస్తుతం నరసింహారావు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ సందర్భంగా తక్షణ సహాయం అందించి తన ప్రాణాలను కాపాడినందుకు హోంమంత్రి సుచరిత, మరో మంత్రి తానేటి వనితకు నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా  మంత్రులు చేసిన ఈ సహాయం పట్ల రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హర్షం వ్యక్తం చేశారు..